22-03-2025 11:15:07 AM
ఆటో డ్రైవర్ తో పాటు మరో ఇద్దరికీ గాయాలు
కామారెడ్డి,(విజయక్రాంతి): రోడ్డు ప్రమాదంలో మీ సేవ నిర్వాహకుడు మృతి చెందగా ఆటో డ్రైవర్ తో పాటు మరో ఇద్దరికి గాయాలైన ఘటన కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రం శివారులో శుక్రవారం రాత్రి ఈ సంఘటన చోటు చేసుకుంది. స్థానికులు పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. రామరెడ్డి మండల కేంద్రానికి చెందిన మీ సేవ నిర్వాహకుడు. దినేష్ బైక్ పై కామారెడ్డి నుంచి రామారెడ్డి వైపు వస్తుండగా ఎదురుగా రామారెడ్డి వైపు నుంచి కామారెడ్డి వైపు వస్తున్న ఆటోను రామారెడ్డి గ్రామ శివారులో బైక్ పై వస్తున్న దినేష్ ఆటోను ఢీ కొట్టి కింద పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఆటో నడుపుతున్న లింబాద్రి తో పాటు అతని భార్య మరో ప్రయాణికురాలు కు గాయాలైనట్లు ఎస్సై నరేష్ తెలిపారు. గాయపడిన వారిని కామారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు ఎస్సై తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.