28-02-2025 05:29:07 PM
మందమర్రి (విజయక్రాంతి): మానవులు ధరించే దుస్తుల అల్లికలు కుట్లలో మేదర్ల వికీలక పాత్ర అని అందమైన దుస్తులు చిత్రీకరించడంలో వారిది నేర్పరితనం ప్రశంసనీయం అని కాంగ్రెస్ నాయకులు మార్కెట్ కమిటీ ప్రధాన కార్యదర్శి మంద తిరుమల్ రెడ్డి ఆన్నారు. టైలర్స్ డే ను పురస్కరించుకొని పట్టణ మేరు సంఘం ఆద్వర్యంలో శుక్రవారం పట్టణంలోని మార్కెట్ హనుమాన్ ఆలయంలో నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్బంగా మేరు కుల దైవం శంకర దాసమయ్య చిత్రపటానికి కులసంఘం నాయకులు, మార్కెట్ వ్యాపార సంఘం అధ్యక్షులు తమ్మిశెట్టి విజయ్ వ్యాపారస్తులతో కలిసి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
అనంతరం కేకు కట్ కోశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... మేరు కులస్తులు ఉపాధి కోసం, పనిముట్ల కోసం సబ్సిడీ ప్రభుత్వం సబ్సిడీ రుణాలు అందజేస్తుందని వీటిని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా రాణించాలని కోరారు. మేరు సంఘం నాయకులు రాయబారపు వెంకన్న, రాయబారపు కిరణ్ లు మాట్లాడుతూ రెడీమేడ్ దుస్తులు, కార్పొరేటు షాపింగ్ మాల్ లు రావడంతో దర్జీ పని అంతరించిపోయిందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఒకప్పుడు మిషన్ తో దుస్తు కుట్టే దర్జీలు దర్జాగా ఉండేవారని, చేతినిండా పని ఉండేదని రీడిమెడ్ విష సంస్కృతి విస్తృతం కావడంతో ప్రస్తుత కాలంలో కుట్టు మిషన్ నడువక, దర్జీలు పని లేక దిగాలుగా ఉండాల్సి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
చేతిలో పనిలేకపోవడంతో మేరుకులస్తుల కుటుంబాలు రోడ్డున పడే దుస్థితి ఏర్పడిందని వారిని ప్రభుత్వం ఆదుకొని ఉపాధి అవకాశాలు కల్పించాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలొ మేరు సంఘం ప్రధాన కార్యదర్శి మాడిశెట్టి రవీందర్, గట్ల సారంగపాణి, కోశాధికారి సూర్యనారాయణ, కర్నె వెంకన్న, గంగాధర్, లక్ష్మణ్, రవి, సుజిత్, రాము, సూర్య ప్రకాష్, సత్యనారాయణ, శ్రీనివాస్, రాజు, కుమార్, సతీష్ లు పాల్గొన్నారు.