17-03-2025 01:27:30 AM
హార్ట్ ఫుల్ నెస్ యోగ ట్రైనర్ హరికృష్ణ
జగిత్యాల, మార్చి 16 (విజయక్రాంతి): మనం ఉన్న స్థితి నుండి మానసికంగా ఉన్నత స్థితికి చేరుకోవడమే ధ్యానం అని హార్ట్ ఫుల్ నెస్, రామచంద్ర మిషన్ యోగ ట్రైనర్ హరికృష్ణ పేర్కొన్నారు. హార్ట్ ఫుల్ నెస్ సంస్థ రామచంద్ర మిషన్ ఆధ్వర్యంలో కోరుట్ల పట్టణంలోని వాసవి కళ్యాణ భవనంలో 3 రోజుల ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్ర మంలో భాగంగా ఆదివారం జరిగిన యోగ కార్యక్రమం ఆకట్టుకుంది. మొదట నిర్వాహకులు మంచాల కృష్ణ మాట్లాడుతూ హార్ట్ ఫుల్నెస్ సంస్థ లక్ష్యాలను పరిచయం చేశారు.
ధ్యాన శిక్షకులు హరికృష్ణ మాట్లాడుతూ ధ్యానం చేయడం వల్ల ఆధ్యాత్మికతతో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. మన ప్రస్తుత స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోవడానికి ప్రశాంతంగా, ఆరోగ్యంగా ఉండ డానికి ధ్యానం ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. 2 వందల 50 మంది యోగ సాధకులు ధ్యానంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు మోటూరి రాజు, నిర్వాహకులు కేఎల్‌ఎన్ కృష్ణ, పడిగెల శ్రీనివాస్, మం చాల జగన్, బట్టు హరికృష్ణ, కటకం గణేష్, మంచాల రాజలింగం, ముక్క రాము, అల్లాడి మహేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.