calender_icon.png 7 February, 2025 | 5:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెడికవర్ హాస్పిటల్స్ అరుదైన శస్త్రచికిత్స

07-02-2025 12:00:00 AM

శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 6 (విజయక్రాంతి): చిన్నతనంలోనే సున్తీ కారణంగా ఇన్ఫెక్షన్కు గురై పురుషాంగం కోల్పోయిన ఓ యువకునికి అతని ముంజేయి వద్ద పురుషాంగం అభివృద్ధి చేసి, తిరిగి యదాస్తితిలో పురుషాంగం అమర్చి నూతన జీవితం అందించారు మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు.

నైజీరియాకు చెందిన ఓ యువకుడు తన చిన్నతనంలో చేయించుకున్న సున్తీ కారణంగా ఇన్ఫెక్షన్కు గురై తన పురుషాంగం కోల్పోయాడు. సామాజికంగా ఎన్నో వేధింపులకు గురికావడంతో పాటుగా స్నేహితుల హేళనలతో తన పురుషాంగం సృష్టించుకోవడానికి ఎన్నో దేశాలలో ఎన్నో హాస్పిటళ్ళ తిరిగినా ప్రయోజనం లేకుండా పోయింది. చివరకు అతను హైదరాబాద్లోని మెడికవర్ హాస్పిటల్కు వచ్చాడు.

ఇక్కడ సీనియర్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్, ఆండ్రోలజిస్ట్ డాక్టర్ రవికుమార్ తో పాటుగా ప్లాస్టిక్ సర్జన్  డాక్టర్ దాసరి మధు వినయ్కుమార్ ను కలిశారు. రోగి పరిస్థితిని పూర్తిగా పరిశీలించిన తరువాత పురుషాంగంతో పాటుగా వృషణాలను సైతం పునః సృష్టించాలని డాక్టర్లు నిర్ణయించారు.

రోగి ముంజేయి వద్ద మైక్రో వాస్క్యులర్ సర్జరీ ద్వారా రేడియల్ ఆర్జెరీ ఫోర్‌ఆర్మ్ ఫ్లాప్ నుంచి పురుషాంగం పునః సృష్టించారు. ఈ శస్త్రచికిత్స చేయడానికి 10గంటలు పట్టిందని సీనియర్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్, ఆండ్రాలజిస్ట్ డాక్టర్ రవికుమార్ ఏవీ అన్నారు.

ఈ రోగి ఇప్పుడు సాధారణ పురుషుల్లాగానే మూత్రం పోయవచ్చు అని ఆయన తెలిపారు. రోగి ముంజేయి దగ్గర నుంచి పురుషాంగం, సృష్టించడం జరిగిందని కన్సల్టెంట్ ప్లాస్టిక్  సర్జన్ డాక్టర్ దాసరి మధు వినయ్ కుమార్ అన్నారు. అత్యంత అరుదైన కేసు అయినప్పటికి సవాల్గా తీసుకుని ఈ శస్త్రచికిత్సను విజయవంతం చేసినట్లు వైద్యులు తెలిపారు.