calender_icon.png 18 April, 2025 | 12:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గర్భిణులకు మందులు అందుబాటులో ఉంచాలి

11-04-2025 12:26:37 AM

వికారాబాద్,ఏప్రిల్ -10 గర్భవతులకు అవసరమైన మందులను అందుబాటులో ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ వైద్య అధికారికి సూచించారు. గురువారం  దారూర్ మండలం, నాగసముందర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ గావించారు. 

ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పరీక్షలు నిర్వహించాలని అదేవిధంగా వారికి కావాల్సిన ఐరన్, క్యాల్షియం, విటమిన్ మందులను అందిస్తూ వాటిని తప్పనిసరి వాడే విధంగా వారిలో అవగాహన కల్పించాలని కలెక్టర్ వైద్య అధికారి డాక్టర్ మాధవిలతకు  సూచించారు.  ఈ సందర్భంగా ఆసుపత్రిలో కావల సిన అవసరాలపై ఆరా తీశారు.  ఆసుపత్రికి ఫ్యాన్లు అందజేస్తామని కలెక్టర్ తెలిపారు. తర్వాత పేషెంట్లకు అందుతున్న సేవలపై  సిబ్బందిని ఆరా తీశారు.