వైద్య ఆరోగ్య శాఖ అడిషనల్ డైరెక్టర్ యశస్విని
మంచిర్యాల, నవంబర్ 17 (విజయక్రాంతి): సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఏ సీజన్‌లో ఏయే మందులు అవసరమవుతాయో ముందస్తుగానే జిల్లాకు తెప్పించుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ రాష్ట్ర అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ యశస్విని సూచించారు.
ఆదివారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మాతా శిశు సంరక్షణ కేంద్రం, ప్రభుత్వ ఆసుపత్రి, బెల్లంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (సీహెచ్‌పీ), మందమర్రి యాపల్ ఉప కేంద్రంతో పాటు జిల్లా కేంద్రంలోని సెంట్రల్ మందులు నిలువ కేంద్రాన్ని సందర్శించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. మందులు, వాటి వివరాలు, బ్యాచ్ నంబర్లతో రిజిస్టర్‌లో నమోదు చేయాలని, కాలం చెల్లిన మందులను వేరుచేసి రిజిస్టర్‌లో నమోదు చేయాలని సూచించారు. పీహెచ్‌సీలకు మందులు పంపించేటప్పుడు ఆ కేంద్రం ఫార్మాసిస్టుతో సమీక్ష చేసుకోవాలని సూచించారు.
ఆశా కార్యకర్తలకు, ఆరోగ్య కార్యకర్తలకు వైద్య శిబిరాలకు ముందే ఇచ్చే మందులను పరిశీలించి పంపించాలన్నారు. అడిషనల్ డైరెక్టర్ వెంట డీఎంఅండ్‌హెచ్‌వో హరీష్‌రాజ్, డిప్యూటీ డీవై అండ్ హెచ్‌వో అనిత, డీపీవో ప్రశాంతి ఉన్నారు.