వైద్యాధికారులతో మంత్రి రాజనర్సింహ సమీక్ష
సీజనల్, పాముకాటు నివారణ మందులు అందుబాటులో ఉంచాలని ఆదేశం
హైదరాబాద్, జూలై 2: రాష్ర్టంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో అత్యవసర మందులు అందుబాటులో ఉంచాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. సీజనల్ వ్యాధులు, పాము కాటు నివారణ కోసం అవసరమైన మందులు ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందు బాటులో ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. హై దరాబాద్‌లోని రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ కార్యాలయంలో మంగళవారం మం త్రి.. టీజీఎంఐడీసీ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
వైద్య సదుపాయాల కల్పనలో భాగంగా భౌగోళికంగా అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు, పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏరియా, జిల్లా ఆస్పత్రులు ఎంత దూరంలో ఉన్నాయో (హెల్త్ ఫెసిలిటీస్ మ్యాపింగ్) రూట్ మ్యాప్‌ను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో టీజీఎంఎస్‌ఐడీసీ ఎండీ.హేమంత్ సహదేవరావు, రాజీవ్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓ విశాలాక్షి, టీజీఎంఐడీసీ ఈడీ కౌటిల్య, చీఫ్ ఇంజనీర్ దేవేందర్ కుమార్ పాల్గొన్నారు.
మంత్రిని కలిసిన ఆర్‌ఎంపీలు
ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 1273 ద్వారా 12,900 మంది ఆర్‌ఎంపీ, పీఎంపీలకు.శిక్షణ అందించినా, పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్స్ మాత్రం ఇవ్వలేదని ఆర్‌ఎంపీ, పీఎంపీ ప్రతినిధులు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహకు తెలిపారు. తమకు పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్లు అందించాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా తమపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు చర్యలు తీసుకునాలని కోరారు.