calender_icon.png 15 November, 2024 | 1:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దీపావళి వేడుకల్లో మందు, మాంసం

11-11-2024 12:26:15 AM

  1. చిక్కుల్లో బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్‌మర్
  2. అభ్యంతరం వ్యక్తం చేసిన బ్రిటిష్ ఇండియన్ కమ్యూనిటీ

న్యూఢిల్లీ, నవంబర్ 10: లండన్‌లోని 10 డౌనింగ్ స్ట్రీట్‌లో బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్‌మర్ ముఖ్య అతిథిగా హాజరైన దీపావళి వేడుకల మెనూలో నాన్ వెజ్ స్నాక్స్, మద్యాన్ని చేర్చడం పట్ల బ్రిటీష్ హిందువులు సోషల్ మీడియాలో అభ్యంతరం వ్యక్తం చేశారు.

దీపావళి అనేది వేడుకల సమయం మాత్రమే కాదని, దానికి మత పరమైన అర్థం కూడా ఉంటుందని హిందూ సంస్థలు పేర్కొన్నాయి. అందువల్ల పర్వదినం సందర్భంగా మద్యపానం, మాంసాహారానికి దూరంగా ఉంటారని వివరించాయి. హిందువుల పండుగలపై అవగాహన లేకపోవడాన్ని తప్పుపట్టాయి.

దీనిపై ప్రభుత్వ వర్గాలు స్పందించాయి. అక్కడ కేవలం దీపావళినే కాకుండా సిక్కు కమ్యూనిటీకి చెందిన బండి చోర్ దివాస్‌ను కూడా నిర్వహించినట్టు పేర్కొంది. కాగా, ఈ కార్యక్రమంలో గత ప్రధాని రిషి సునాక్ సహా బ్రిటీష్ ఇండియన్ కమ్యూనిటీకి చెందిన నాయకులు, నిపుణులు పాల్గొన్నారు.