- కాకతీయ రాజధానిలో సేవల విస్తరణ
- 300 పడకల ఆస్పత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్
వరంగల్, జూన్ 30: యూరప్‌లోని అతిపెద్ద హెల్త్‌కేర్ గ్రూపులలో ఒకటిగా ప్రపం చవ్యాప్తంగా 12 దేశాలలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న మెడికవర్ ఇప్పుడు వరంగల్‌లో అడుగుపెట్టనుంది. భారత్‌లో ఈ సంస్థకు ఇప్పటికే 24 ఆస్పత్రులు ఉన్నాయి. వరంగల్ నగరంలో భారీ స్థాయిలో 300 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌గా మెడికవర్ ఏర్పాటు చేయగా, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభమైనది.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రు లు దామోదర రాజనరసింహ, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కొండా సురేఖ, సీతక్క, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీఎం సలహాదారు వేంనరేందర్‌రెడ్డి, ఎంపీ కడియం కావ్య, వరంగల్ మేయర్ గుండు సుధారాణితోపాటుగా మెడికవర్ హాస్పిటల్స్ ఇండియా చైర్మన్, ఎండీ డాక్టర్ జీ అనిల్‌కృష్ణ, మెడికవర్ హాస్పిటల్స్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఏ శరత్‌రెడ్డి, హరికృష్ణ తదితరులు హాజరయ్యారు. అత్యున్నత ప్రమాణలాతో అందుబాటు ధరల్లో నాణ్యమైన చికిత్సను అందించడంలో దేశవ్యాప్తంగా మెడికవర్ తన ప్రత్యేకతను నిలుపుకుంది. అత్యాధునిక సాంకేతికత, నైపుణ్యంతో వైద్య సేవలు అందించి ఎంతోమందికి నూతన జీవితాన్ని ప్రసాదించిందని ఎండీ అనిల్‌కృష్ణ పేర్కొన్నారు.
దేశంలో అగ్రగామి మల్టీనేషనల్ హాస్పిటల్ చైన్‌గా ప్రస్తుతం 24 ఆస్పత్రులను నిర్వహిస్తున్నామన్నారు. ఏటా లక్షలాది మందికి నాణ్యమైన వైద్య సేవలను అందిస్తున్నామని తెలిపారు. ఇప్పుడు కాకతీయ నగరమైన వరంగల్‌కు విస్తరించినట్లు తెలిపారు. అత్యంత నిష్ణాతులైన 40 మందికి పైగా డాక్టర్లతో పాటుగా ప్రపంచస్థాయి క్యాత్ ల్యాబ్ ఇక్కడ అందుబాటులో ఉందని చెప్పారు. స్పెషాలిటీ సేవల కోసం హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లే అవసరం ఇక వరంగల్ వాసులకు లేదని భరోసా ఇచ్చారు.