calender_icon.png 8 February, 2025 | 11:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తండాల్లో వైద్య పరీక్షలు..

08-02-2025 07:31:37 PM

మోతే: ప్రతి గిరిజన తండాకు నాణ్యమైన వైద్యం అందాలని ఏదైతే ప్రభుత్వం బావిస్తుందో దానిలో భాగంగానే మోతె మండల పరిధిలోని రాముని తండాలో వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం మండల వైద్యాధికారి డాక్టర్ రాజేష్ ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఇటీవల అనారోగ్యంతో మరణించిన హలవత్ రాజేందర్ కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితులు బాగా లేకపోవడంతో వారికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ప్రజలు ఆరోగ్యం పట్ల పలు జాగ్రత్తలు వహించాలని సూచించారు. పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మూడ్ నగేష్, హలవత్ హేమ్లా, హలవత్ చందా, హలవత్ లింగ, మూడ్ రమేష్, తండ వాసులు పాల్గొన్నారు.