calender_icon.png 15 April, 2025 | 4:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘రెయిన్‌బో’లో గర్భిణికి అరుదైన శస్త్రచికిత్స

13-04-2025 01:58:57 AM

విజయవంతంగా పూర్తిచేసిన వైద్యబృందం

హైదరాబాద్, ఏప్రిల్ 12 (విజయక్రాంతి): హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్‌లోని  బర్త్ రైట్ బై రెయిన్‌బో హాస్పిటల్‌లో నిపుణుల బృందం అసాధారణమైన అరుదైన, సంక్లిష్టమైన గర్భధారణ చికిత్సను విజయవంతంగా నిర్వహించింది.- ప్లాసెంటా పెర్క్రెటా, తక్కువ రక్త నష్టం, రక్తమార్పిడి లేకుండా సురక్షితమైన డెలివరీని సాధించింది. 26 ఏళ్ల గర్భిణికి ప్లాసెంటా పెర్క్రెటా ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఇది చాలా అరుదుగా ఉంటుంది.

ఇక్కడ ప్లాసెంటా అసాధారణంగా గర్భాశయ గోడకు అంటుకుని దాని ద్వారా చొచ్చుకుపోతుంది. మూత్రాశయం లేదా పేగు వంటి సమీపంలోని అవయవాలపై ఇది దాడి చేస్తుంది. ఇటువంటి అధిక-ప్రమాదకర ప్రసూతి శస్త్రచికిత్స సవాలుతో కూడుకున్నది. ప్లాసెంటా పెర్క్రెటా ప్రసవ సమయంలో విపత్కర రక్తస్రావంకు దారితీస్తుంది. ఇది తల్లి, బిడ్డకు ప్రమాదాలను కలిగిస్తుంది.

ఆమె 30 వారాల్లో రెయిన్‌బో హాస్పిటల్స్‌ను సంప్రదించగా సాధారణ స్కాన్ సమయంలో ఇది నిర్ధారణ అయింది అని రెయిన్‌బో హాస్పిటల్‌లోని కన్సల్టెంట్ ప్రసూతి వైద్యులు, ప్రముఖ గైనకాలజిస్ట్, లాపరోస్కోపిక్ సర్జన్ డాక్టర్ హిమబిందు వివరించారు. ఆ మహిళ ఎన్నో ఆసుపత్రులకు వెళ్లినా ఎవరూ చేర్చుకోలేదని చెప్పారు. తమను సంప్రదించి నప్పుడు పూర్తి వివరాలు చెప్పి.. శస్త్రచికిత్స చేశామని డాక్టర్ హిమబిందు తెలిపారు.

రక్తస్రావం నివారించడానికి మేము 35 వారాల్లోనే బిడ్డను ప్రసవించాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. డాక్టర్ హిమబిందు నేతృత్వంలోని బృందంలో ఆక్సాన్ గ్రూప్ నుంచి అనస్థీషియాలజిస్టులు డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ గీత, సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ విపిన్ గోయెల్, స్టార్ హాస్పిటల్స్ నుంచి ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ మహేష్, అత్యంత నైపుణ్యం కలిగిన నర్సింగ్ సిబ్బంది ఉన్నారు. చాలా క్లిష్టమైన ఈ శస్త్ర చికిత్స ప్రక్రియ మొత్తం 6 గంటలు పట్టింది. సాధారణ సీ మాదిరిగానే చేశామని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ప్లాసెంటా పెర్క్రెటా కేసులలో ఇది అరుదైన ఘనత. తల్లి, బిడ్డ ఇద్దరూ ఇప్పుడు క్షేమంగా ఉన్నారని హిమబిందు తెలిపారు.