22-03-2025 10:10:16 PM
ఆదిలాబాద్,(విజయక్రాంతి): ఆదిలాబాద్ లోని పలు స్కానింగ్ సెంటర్లలో వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక బృందం ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. గర్భస్థపూర్వ, గర్భస్థ పిండ లింగ నిర్ధారణ ప్రక్రియ చట్టరీత్యా నేరం అని, ఈ చట్టన్ని మరింత బలోపేతంగా అమలు చేయుటలో భాగంగా శనివారం స్థానిక శ్రావ్య నర్సింగ్ హోమ్, గణపతి డయాగ్నొస్టిక్స్ సెంటర్ లో జిల్లా డిప్యూటీ వైద్యాధికారి డాక్టర్ సాధన నేతృత్వంలో బృందం సభ్యులు తనిఖీ చేశారు. సెంటర్ల లోని పలు రికార్డులను పరిశీలించారు. తనిఖీల్లో బృందం సభ్యులు రిమ్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ క్రాంతి, మిషన్ కోఆర్డినేటర్ యశోద, మహిళ పోలీస్ వైష్ణవి పాల్గొన్నారు.