calender_icon.png 25 January, 2025 | 1:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైద్య విద్యార్థులు మానసికంగా దృఢంగా ఉండాలి

24-01-2025 12:00:00 AM

వికారాబాద్ జనవరి 23(విజయ క్రాంతి): వైద్య విద్యార్థులు మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండాలని భారత ప్రభుత్వ కుటుంబ సంక్షేమ శాఖ సీనియర్ ప్రాంతీయ సంచాలకురాలు డాక్టర్ అనురాధ మెడోస్ అన్నారు. గురువారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ, ప్రోగ్రాం అధికారులతో కలిసి వికారాబాద్ ప్రభుత్వ మెడికల్ కళాశాలను ఆమె సందర్శించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ  వైద్య విద్యార్థులకు వైద్య విద్యతో పాటు మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండేల ప్రభుత్వ వైద్య ఆరోగ్యశాఖ ద్వారా అమలవుతున్న వివిధ జాతీయ ఆరోగ్య కార్యక్రమాల గురించి వైద్య విద్యార్థులకు  వివరించాలని సూచించారు.

అనంతరం పాలిటివ్ కేర్ విభాగాన్ని సందర్శించి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ అవసాన దశలో ఉన్న రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని సూచించారు. అనంతరం మహావీర్ వైద్య కళాశాలను సందర్శించి కళాశాల ప్రిన్సిపల్ వైస్ ప్రిన్సిపల్, కోఆర్డినేటర్ లతో వైద్య కళాశాలలో అందిస్తున్న సేవల గురించి ఆరా తీశారు.