calender_icon.png 10 January, 2025 | 12:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొనసాగుతున్న వైద్య విద్యార్థుల ఆందోళన

03-01-2025 03:17:34 PM

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): వైద్య కళాశాలలో నెలకొన్న సమస్యలతో పాటు ఫ్యాకల్టీని నియమించాలని విద్యార్థుల ఆందోళన కొనసాగుతుంది. శుక్రవారం కళాశాల ఎదుట రెండో రోజు విద్యార్థులు బైఠాయించి తమ సమస్యలు పరిష్కరించే వరకు నిరసన వ్యక్తం చేస్తామని స్పష్టం చేశారు. ఆందోళన చేస్తున్న విషయం తెలుసుకున్న ఏఎస్పి చిత్తరంజన్ కళాశాలకు చేరుకున్నారు. కళాశాలలో నెలకొన్న సమస్యలతో పాటు వైద్యం అందించేందుకు కావలసిన ఫ్యాకల్టీకి సంబంధించిన వివరాలను విద్యార్థులను తెలుసుకున్నారు.

వీలైనంత త్వరగా వైద్య కళాశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు సంబంధిత అధికారులతో కలసి కృషి చేస్తామని విద్యార్థులకు హామీ ఇచ్చారు. ఎంతో కష్టపడి ఎంబిబిఎస్ చదివేందుకు సీటు సాధించిన తమకు విద్యాబోధన చేసే అధ్యాపకులు లేకపోవడంతో ఏమి లాభమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫ్యాకల్టీ లేకపోవడం వల్ల తమ భవిష్యత్తు పై తీవ్ర ప్రభావం పడుతుందని అధికారులు, ప్రభుత్వం స్పందించి వెంటనే పూర్తిస్థాయిలో ఫ్యాకల్టీని నియమించాలని డిమాండ్ చేశారు.