calender_icon.png 21 March, 2025 | 6:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నమ్మకం కలిగే విధంగా వైద్య సేవలు అందించాలి

20-03-2025 02:09:16 AM

కలెక్టర్ హనుమంతరావు 

యాదాద్రి భువనగిరి మార్చి 19 ( విజయ క్రాంతి ): నేను రాను బిడ్డ్డో .. సర్కారు దావకానకు అని పద్ధతికి స్వస్తి పలికి దశాబ్దాలు గడిచింది. అయినా వైద్య సేవలు అందించడంలో ప్రజలకు నమ్మకం కలగకపోవడంతో ప్రైవేట్ ఆసుపత్రుల బాటపడుతున్నారు అని జిల్లా కలెక్టర్ ఎం హనుమంతరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో  ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తూ ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల  నమ్మకం కలిగించాలని కోరారు.

బుధవారం రోజు వలిగొండ మండలం లో గల ప్రైమరీ హెల్త్ సెంటర్ ని కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. అటెండెన్స్ రిజిస్టర్, ఓ. పి రిజిస్టర్ ని పరిశీలించారు. ప్రతిరోజు  ఎంతమంది పేషెంట్లు వస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న వైద్యులు, సిబ్బంది గురించి ఆరా తీశారు. వైద్యులు, సిబ్బంది సమయ పాలన పాటించాలని పాటించని వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

మానస సీనియర్ అసిస్టెంట్ విధులకు హాజరు కాకపోవడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు.  మానస సీనియర్ అసిస్టెంట్ కి షోకాజ్ నోటీసు జారీ చేయడం జరిగింది. జగదీష్ ఫార్మసిస్ట్ విధులకు హాజరు కాకపోవడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. జగదీష్ ఫార్మసిస్ట్ కి షోకాజ్ నోటీసు జారీ చేశారు. అత్యవసర విభాగం సిబ్బంది అందరూ అందుబాటులో ఉండాలని ఆదేశించారు. 

హాస్పటల్ పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచాలని శానిటేషన్ సిబ్బంది ని ఆదేశించారు.ఆసుపత్రి కి వచ్చిన వారిని ప్రవేట్ ల్యాబ్ కి పంపిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మార్చి నెలలో 18 ఈడీడీలు ఉండగా ఒక్క డెలివరీలు మాత్రమే చేశారని  ప్రసవాల సంఖ్య  పెంచాలని డాక్టర్లకు సూచించారు.

సాధ్యమైనంతవరకు  సాధారణ ప్రసవాలు జరిగేలా కృషి చేయాలని  వైద్యులకు సూచించారు. అన్ని  రకాల మందులు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమం లో వైద్యాధికారులు, సిబ్బంది సంబంధిత అధికారులు పాల్గొన్నారు.