calender_icon.png 11 March, 2025 | 5:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైద్యసేవలను మరింత మెరుగుపరచాలి

11-03-2025 12:00:00 AM

కలెక్టర్ సిక్తా పట్నాయక్

నారాయణపేట. మార్చి 10(విజయక్రాంతి) : జిల్లా ఆసుపత్రిలో వైద్య సేవలను మరింత మెరుగుపరచాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. ఈ వేసవికాలం ఎండలు తీవ్రంగా ఉండే అవకాశం ఉందని, వైద్యశాఖ పరంగా సమ్మర్ యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవాలని ఆమె తెలిపారు. జిల్లా జనరల్ హాస్పిటల్ ( జీ జీ హె) సమన్వయకర్తగా ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రామ్ కిషన్ ఇటీవలే బాధ్యతలు చేపట్టడంతో సోమవారం కలెక్టర్ జిల్లా ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా  జిల్లా ఆస్పత్రి సమన్వయకర్త డాక్టర్ రామ్ కిషన్, వైద్య నిపుణులు డాక్టర్ మల్లికార్జున్, డాక్టర్ మోహన్ తో  జిల్లా ఆస్పత్రిలో వైద్య సేవలు, క్యాడర్ స్ట్రెంత్, బడ్జెట్ తదితర అంశాలపై కలెక్టర్ చర్చించారు.

ఇక నుంచి మెడికల్ కళాశాల తో పాటు  జిల్లా ఆస్పత్రి పర్యవేక్షణను చూసుకోవాలని ప్రిన్సిపాల్ రామ్ కిషన్ కు ఆమె సూచించారు.   ఒక జూనియర్ అసిస్టెంట్, ఒక సీనియర్ అసిస్టెంట్ అవసరమని,ఎవరినైనా డిప్యూట్ చేయించాలని డాక్టర్ రామ్ కిషన్ ఈ సందర్భంగా కలెక్టర్‌ను కోరారు. శానిటేషన్ వర్కర్ల కు వేతనం ఎలా చెల్లిస్తారని కలెక్టర్ ప్రశ్నించగా, వారికి  థర్డ్ పార్టీ ఏజెన్సీ ద్వారానే నేరుగా వారి ఖాతాల్లోనే వేతనాలు జమ అవుతాయని ప్రిన్సిపల్ డాక్టర్ రామ్ కిషన్ తెలిపారు. ఆసుపత్రి భవన ప్రస్తుత పరిస్థితి గురించి వారు చర్చించారు.