calender_icon.png 19 October, 2024 | 2:43 PM

ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్య సేవలు నిర్వీర్యం

19-10-2024 01:00:53 PM

పది రోజుల్లో  గజ్వేల్ మాతా శిశు  ఆస్పత్రిలో  పూర్తి వైద్య సేవలు అందించాలి 

ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన మాజీ ఎఫ్ డిసి చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి  

గజ్వేల్, (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో వైద్య సేవలు నిర్వీర్యం అవుతున్నాయని, పూర్తిస్థాయి వైద్య మందక పేదలు ఇబ్బందులు పడుతున్నారని మాజీ ఎఫ్ డి సి  చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్సి రాజమౌళిలు అన్నారు. శనివారం మాతా శిశు ఆసుపత్రిలో వైద్య సేవలను పరిశీలించి వైద్యుల వద్ద వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ.. పదేళ్లలో జిల్లా స్థాయి దావఖానలను అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ఘనత మాజీ సీఎం కేసీఆర్ దే అన్నారు. గతంలో ప్రభుత్వ దావకానలోనూ కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందాయని ప్రస్తుతం దవఖానలలో సరిపోయే మందులు కూడా ఇవ్వక ప్రైవేటుగా కొనుక్కోవాల్సి వస్తుందని ఆరోపించారు.

ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుండి బాలింతలకు కిట్లను కూడా పంపిణీ చేయడం లేదన్నారు. సొంత దందాలు చేయడానికి పోటీపడుతున్న కాంగ్రెస్ నాయకులు వైద్యానికి నిధులు వెచ్చించడానికి నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. గజ్వేల్ లో రూ.33 కోట్లతో మాత శిశు దవఖాన కేసీఆర్ నిర్మిస్తే కనీసం వాటిలో అవసరమైన మౌలిక వసతులు కల్పించడంలో ప్రస్తుత ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందన్నారు. అవసరమైన పూర్తిస్థాయి మౌలిక వస్తువులను పది రోజుల్లో ఏర్పాటు చేసి అన్ని సేవలు అందించాలని, లేనిపక్షంలో ఆసుపత్రి ఎదుట బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జకియుద్దీన్, కౌన్సిలర్లు గోపాల్ రెడ్డి,  శ్రీనివాస్, బొగ్గుల చందు, నాయకులు నవాజ్ మీరా,  అహ్మద్  తదితరులు పాల్గొన్నారు.