11-02-2025 12:55:53 AM
కామారెడ్డి, ఫిబ్రవరి 10 (విజయ క్రాంతి): మాచారెడ్డి గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో సోమవారం ఆరోగ్య శిబిరం నిర్వహించారు. మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఆదర్శ్ మాట్లాడుతూ 91 మంది బాలికలకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేసినట్లు వివరించారు.
ఏడు మంది బాలికలకు ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు గుర్తించామన్నారు. అనంతరం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చునని సూచించారు. సి హెచ్ ఓ వై.వి రావు ,గీత ,జయలక్ష్మి , ఆశాలు పాల్గొన్నారు