calender_icon.png 22 September, 2024 | 7:08 AM

గ్రూప్- 4 దివ్యాంగ అభ్యర్థులకు 30 నుంచి వైద్య పరీక్షలు!

28-07-2024 02:05:31 AM

  1. డీఏవో ప్రాథమిక కీ విడుదల 
  2. ఆగస్టు 5 నుంచి జేఎల్ సర్టిఫికెట్ వెరిఫికేషన్: వెల్లడించిన టీజీపీఎస్సీ

హైదరాబాద్, జూలై 27 (విజయక్రాంతి): ధ్రువపత్రాల పరిశీల పూర్తయిన గ్రూప్ దివ్యాంగ అభ్యర్థులకు ఈనెల 30 నుంచి వచ్చే నెల 5 వరకు మెడికల్ టెస్టులు నిర్వహించనున్నట్టు టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. వైద్య పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు హాల్‌టికెట్, ఆధార్ కార్డు, పాత మెడికల్ సర్టిఫికెట్, విద్యార్హత సర్టిఫికెట్‌తోపాటు కుటుంబ సభ్యుడిని వెంట తీసుకురావాలని సూచించారు. మెడికల్ టెస్టు షెడ్యూల్‌ను వెబ్‌సైట్‌లో పెట్టినట్టు తెలిపారు.

31న డీఏవో కీ విడుదల 

డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ (వర్స్) గ్రేడ్ పోస్టులకు నిర్వహించిన పరీక్ష ప్రిలిమినరీ కీని ఈ నెల 31న విడుదల చేయనున్నట్టు నవీన్ నికోలస్ తెలిపారు. అభ్యంతరాలను ఆగస్టు 1 నుంచి 5 వరకు కమిషన్ వెబ్‌సైట్‌కు పంపాలని సూచించారు. 

జేఎల్ 1:2 జాబితా 

ఇంటర్ విద్యాశాఖలోని జూనియర్ లెక్చర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్షకు సంబంధించి జనరల్ అభ్యర్థులకు 1:2, దివ్యాంగులకు 1:5 జాబితాను టీజీపీఎస్సీ విడుదల చేసింది. ఆగస్టు 5 నుంచి సెప్టెంబర్ 11 వరకు ఆయా అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియను నిర్వహించనున్నట్టు కార్యదర్శి నవీన్ నికోలస్ ఓ ప్రకటనలో తెలిపారు.