calender_icon.png 31 January, 2025 | 2:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైద్యవిద్య ప్రమాణాలు పెంచాలి

26-01-2025 12:41:37 AM

నూతన డీఎంఈను ఆదేశించిన మంత్రి దామోదర

హైదరాబాద్, జనవరి 25 (విజయక్రాంతి): రాష్ట్రంలో వైద్యవిద్య ప్రమాణాలు మరింతగా మెరుగుపడేలా చర్యలు తీసుకోవాలని వైద్యవిద్య నూతన సంచాలకుడి(డీఎంఈ)గా నియమించబడిన డాక్టర్ నరేంద్రకుమార్‌ను వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. శనివారం డీఎంఈ మంత్రిని కలిశారు.

ఈ సందర్భంగా మంత్రి రాజనర్సింహ ఆయనకు పలు సూచనలు చేశారు. కొత్త మెడికల్ కళాశాలలతో పాటు ఇప్పటికే ఉన్న అన్ని ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో సరైన బోధనా పద్ధతులు అమలు అయ్యేలా చూడాలన్నారు. తనను డీఎంఈగా నియమించినందుకు వైద్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన నరేంద్ర కుమార్.. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం రాష్ట్రంలో వైద్య విద్య ప్రమాణాలు మెరుగుపడేందుకు కృషి చేస్తానని తెలిపారు.