ప్రకటించిన తాలిబన్ ప్రభుత్వం
తప్పుపట్టిన క్రికెటర్లు రషీద్, నబీ
కాబూల్, డిసెంబర్ 5: ఆఫ్ఘనిస్తాన్‌లోని తాలిబన్ ప్రభుత్వం మహిళలపై మరిన్ని ఆంక్షలు విధించింది. తాజాగా మహిళలు వైద్య విద్యను అభ్యసించడాన్ని నిషేధించిం ది. నర్సింగ్, మిడ్ వైఫరీ కోర్సులతో సహా వైద్య విద్యలో మహిళలు ఎవరూ చేరకూడదని తాలిబన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే తాలిబన్ ప్రభుత్వ నిర్ణయంపై ఆ దేశ క్రికెటర్లు రషీద్ ఖాన్, మహ్మ ద్ నబీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం తీవ్ర అన్యాయమని, మహిళలకు తీవ్ర ఆవేదనను కలిగిస్తుందని నబీ అన్నారు.
అమ్మాయిలు వైద్యవిద్య చదువుకుని ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని నిరాకరించడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. వారి కలలకు, దేశ భవిష్యత్‌కు ద్రోహం చేయడమేనని అన్నారు. మహిళలకు వైద్య విద్య నిషేధంపై తీసుకున్న నిర్ణయాన్ని పునరాలోచించాలని తాలిబన్ ప్రభుత్వానికి రషీద్‌ఖాన్ విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరూ చదువుకోవడానికి హక్కు ఉందని ఇస్లాం బోధిస్తుందని ఆయన గుర్తు చేశారు. మహిళల విద్యా హక్కును పునరుద్ధరించాలని కోరారు. తాలిబన్ నిర్ణయం దేశ భవిష్యత్‌ను మాత్రమే కాకుండా సమా జ నిర్మాణంపై, ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపెడుతుందని రషీద్ పేర్కొన్నారు. మరోవైపు తాలిబన్ నిర్ణయాన్ని యూరోపియన్ యూనియన్ కూడా ఖండించింది.