09-03-2025 07:24:18 PM
ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి..
హర్షం వ్యక్తం చేస్తున్న పద్మశాలీలు..
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): స్వతంత్ర సమరయోధుడు, తెలంగాణ పోరాట ప్రటిమ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ పేరును కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని మెడికల్ కళాశాలకు పెట్టుతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో నిర్వహించిన అఖిలభారత పద్మశాలి సంఘం 17వ మహాసభలో ప్రకటించారు. కళాశాల ఏర్పాటు అయినప్పటి నుండి ఈ ప్రాంతంలో తెలంగాణ వాదులు, బాపూజీ అభిమానులు, పద్మశాలీలు కళాశాలకు కొండా లక్ష్మణ్ బాపూజీ నామకరణం చేయాలని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మంత్రులకు, కలెక్టర్ తో పాటు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్లడం జరిగింది.
ఈ ప్రాంత ప్రజల విన్నపం మేరకు ప్రభుత్వం కళాశాలకు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ నామకరణాన్ని ప్రకటించడం పట్ల జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మహనీయుని పేరు ప్రకటించడంతో పద్మశాలీలు సంబరాలు జరుపుకుంటున్నారు. కొండ లక్ష్మణ్ బాపూజీ పేరు ప్రకటించడంతో ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి పద్మశాలిలో కృతజ్ఞతలు తెలిపారు.