calender_icon.png 3 April, 2025 | 11:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైద్య శిబిరాలను వినియోగించుకోవాలి

24-03-2025 12:00:00 AM

ముషీరాబాద్, మార్చి 23: (విజయక్రాంతి):  ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకొని సం పూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలని ప్రార్థన వీరుల చర్చి ఫాస్టర్ మరిదాస్ అన్నారు ఈ మేరకు ఆదివారం రాంనగర్లోని ప్రార్థన వీరుల చర్చిలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.

ఈ సం దర్భంగా కంటి పరీక్షలు, దంత పరీక్ష లు, బీపీ, షుగర్, ఈసీజీ తదితర వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వా రికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి గా హాజరైన ఫాస్టర్ మరిదాస్ మాట్లాడుతూ కార్పొరేట్ వైద్య సంస్థ లు, స్వచ్ఛంద  సంస్థలు మానవతా దృక్పథంతో పేద ప్రజలు నివసించే ప్రాంతాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమం లో చరా ఫాస్టర్ జేమ్స్ నిర్వాహకులు ఎప్తా బెన్నీ తదితరులు  పాల్గొన్నారు.