calender_icon.png 19 April, 2025 | 11:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదప్రజల ఆరోగ్య అవసరాలను తీర్చేందుకు గ్రామాల్లో శ్రీపాద ట్రస్టు ఆధ్వర్యంలో వైద్య శిబిరాలు

19-04-2025 05:40:31 PM

పుట్టపాకలో ఉచిత వైద్య శిబిరంలో పిఎసిఎస్ చైర్మన్ కొత్త శ్రీనివాస్..

మంథని (విజయక్రాంతి): పేద ప్రజల ఆరోగ్య అవసరాలను తీర్చేందుకు గ్రామాల్లో శ్రీపాద ట్రస్టు ఆధ్వర్యంలో వైద్య శిబిరాల నిర్వహిస్తున్నామని పిఎసిఎస్ చైర్మన్ కొత్త శ్రీనివాస్(PACS Chairman Kotha Srinivas) అన్నారు. శనివారం మండలంలోని పుట్టపాక గ్రామంలో శ్రీ వైద్య ఫౌండేషన్ సహకారంతో శ్రీపాద ట్రస్టు ఆధ్వర్యంలో శనివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరాన్ని మంథని సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ సందర్శించి రోగులకు అందిస్తున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. శ్రీపాద ట్రస్ట్ ఆధ్వర్యంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు చాట్లపల్లి సంతోష్, సవాయి గట్టయ్య, ఎడ్ల శ్రావణ్, కన్నూరి రాజబాబు, సుదర్శన్, మారిశెట్టి కుమార్, రేపాక లక్ష్మణ్, హుస్సేని, వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.