కుమ్రభీం ఆసిఫాబాద్, (విజయక్రాంతి): ఆసిఫాబాద్ మండలంలోని మోవాడ్, బలన్ పూర్, చింతగుడ గ్రామాలలో డాక్టర్ వినొద్ కుమార్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా వర్షాకాలంలో వ్యాధుల పట్ల వచ్చే మలేరియా, డేంగు, చికున్ గున్యాపై అవగాహన కల్పించారు. పరిసరాల పరిశుభ్రతతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచించారు. నీరు నిల్వ ఉంచ కుండ వారానికి రెండు సార్లు డ్రమ్ములు ,ట్యాంకులు శుభ్రపరచుకోవాలని అవగాహన కల్పించారు. 15 మందిని రక్త పరీక్షలు నిర్వహించారు. 42 మందిని పరీక్షించి సాధారణ మాత్రలను డాక్టర్లు కీర్తి, నజమస్ అందజేశారు. ఈ కార్యక్రమంలో యంపిహెచ్ఎస్ సరిత, ఉత్తం, భీంరావ్, పరుశురాం, సూర్యకళ, వసంత, రాధ పాల్గొన్నారు.