18-03-2025 07:03:08 PM
బెల్లంపల్లి (విజయక్రాంతి): వాసవి క్లబ్ అంతర్జాతీయ అధ్యక్షులు ఇరుకుల్ల రామకృష్ణ అధికారిక పర్యటనలో భాగంగా మంగళవారం తాండూరు మండలంలోని గిరిజన గ్రామమైన నర్సాపూర్ లో తాండూర్ వాసవి క్లబ్ సభ్యులు ఉచిత ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు. నేత్ర సమస్యలు ఉన్నవారికి ఉచిత నేత్ర వైద్యశిబిరం ఏర్పాటు చేశారు. పరీక్షలు నిర్వహించి కంటి ఆపరేషన్లు జరిపిస్తామని తెలిపారు. నిరుపేద విద్యార్థులకు ఒక్కొక్కరికి 1000 రూపాయలు చొప్పున 10 మందికి ఆర్థిక సహాయం అందజేశారు. ఉచిత డయాబెటిక్ గుర్తింపు శిబిరం, మానసిక వికలాంగులకు చేయూత, పదో తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్స్ పంపిణీ చేశారు.
వాసవియన్ జిల్లా 107 కార్పొరేట్ వైస్ చైర్మన్ గోల్డెన్ స్టార్ సంతోష్ కుమార్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వాసవి క్లబ్ అంతర్జాతీయ అధ్యక్షులు ఎరుకుల రామకృష్ణ హాజరయ్యారు. ముందుగా కొమరం భీం విగ్రహానికి పూలమాలలు వేసి రక్త పరీక్షలు నేత్ర పరీక్షల శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఆరోగ్య శిబిరంలో 200 మంది పాల్గొన్నారు.
కార్యక్రమంలో మాదారం ఎస్ఐ సౌజన్య మహేష్, పంచాయతీ కార్యదర్శి జగదీష్, కంటి పరీక్ష నిపుణులు డాక్టర్ అంజయ్య, డయాబెటిస్ పరీక్షల కొరకు ల్యాబ్ టెక్నీషియన్ పీ.సంతోష్, తాండూర్ వాసవి క్లబ్ అధ్యక్షులు మైలారపు మధుసూదన్, కార్యదర్శి కాసనగొట్టు మని కృష్ణ, కోశాధికారి రాచకొండ మహేష్, ఇంటర్నేషనల్ ఉపాధ్యక్షులు రేణికుంట్ల శ్రీనివాస్, 107 జిల్లా గవర్నర్ ఇల్లందుల కిషోర్, జిల్లా వైస్ గవర్నర్ బాలమోహన్, జిల్లా సర్వీస్ సెక్రటరీ కొంకుముట్టి వెంకటేశ్వర్లు, జిల్లా సమీక్ష కార్యదర్శి జిల్లా కోశాధికారి బోనగిరి వేణుగోపాల్, సిర్పా శ్రీకాంత్, రీజన్ చైర్మన్ కేశతి వంశీకృష్ణ, జోన్ చైర్మన్ మేడి లావణ్య, కాసం భాస్కర్, గందె వెంకటరమణ, ఊటూరి నరేష్, చిలువేరి సాయి కృష్ణ, ఏం. సంతోష్, ఎస్ సాయి కృష్ణ, మైలారపు అక్షయ, సామ కల్పన, పుల్లూరి సుమతి, కొడిపాక మాధురి, కాసం సునీత, కాసనగొట్టు సాయి కృప తదితరులు పాల్గొన్నారు.