calender_icon.png 19 April, 2025 | 8:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాల గురిజాలలో మెడికల్ క్యాంపు

19-04-2025 04:47:21 PM

బెల్లంపల్లి అర్బన్: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం మాల గురిజాలకి ఎట్టకేలకు వైద్యాధికారుల బృందం తరలివచ్చింది. మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు చేస్తున్నారు. కలుషితమైనా తాగునీరు, అక్కడ గుడుంబా (నాటు సారాయి) వ్యసనాలకు లోనైనా పలువురు ఇటీవల కిడ్నీ జబ్బులతో మృత్యువాత పడుతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా ఉప వైద్యాధికారి సుధాకర్ నాయక్, వైద్యుల బృందం గ్రామానికి తరలివచ్చింది. మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి వైద్య రక్త పరీక్షలు నిర్వహిస్తున్నారు.

కిడ్నీ జబ్బులు ప్రబలడానికి కారణాలపై వైద్యాధికారులు అన్వేషిస్తున్నారు. అందులో భాగంగా రెండు రోజులుగా వైద్య సిబ్బంది మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు చేస్తున్నారు. కిడ్నీ జబ్బులకు త్రాగునీరా? లేదా అనే విషయం తేల్చడానికి అధికారులు గ్రామస్తులకీ వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నారు. మరోవైపు అక్కడ తాగునీటి బోరు బావులనీటి పరీక్షలను కూడా అధికారులు చేపిస్తున్నారు. నీటి శాంపిల్స్ వరంగల్ కి ల్యాబ్ పరీక్షల కోసం పంపించి కిడ్నీ జబ్బులకు అసలైన కారణాలను తెలుసుకునేందుకు వైద్యాధికారులు ప్రయత్నిస్తున్నారు. మెడికల్ క్యాంపులను ఉప వైద్యాధికారి సుధాకర్ పరిశీలించారు.