09-03-2025 10:36:47 PM
చర్ల (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల సరిహద్దు రాష్ట్రమైన ఛత్తీస్గడ్ రాష్ట్ర కౌరగట్ట గ్రామంలో ఆదివారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు.151 bn బెటాలియన్ కమాండెంట్ కే ఆర్ రాజీవ్ ఆదేశానుసారం కమాండ్ నితిన్ షిండే శివదాస్, సి & ఇ/151 బెటాలియన్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం, పౌర చర్య కార్యక్రమాన్ని నిర్వహించించారు. చతిస్గడ్ రాష్ట్రంలోని కౌరగట్టా అటవీ గ్రామ ప్రజలకు కనీస అవసరాలు తీర్చే వస్తువులు అందజేశారు.
32 ఇంచుల టీవీ, సోలార్ లాంతర్లు, స్కూల్ బ్యాగులు, నోట్‌బుక్‌లు, రైటింగ్ మెటీరియల్, స్టీల్ ప్లేట్, స్టీల్ గ్లాసెస్, క్రికెట్ కిట్, టెన్నిస్ బాల్, వ్యాలీ బాల్ కిట్, ఫుట్‌బాల్, వాటర్ ట్యాంకులు 200 లీటర్ల వాటర్ ట్యాంక్, సైకిళ్ళు, దుప్పట్లు వితరణ చేశారు. ఇందులో భాగంగా మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నీరాజ్ పాండే రోగులకు ఆరోగ్య పరీక్షలు చేసి అవసరమైన మందులు ఉచితంగా అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు అటవీ గ్రామాల్లో నిర్వహించడానికి పోలీసు వ్యవస్థ ఎప్పుడు ముందుంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు సీఆర్పీఎఫ్ పోలీస్ బెటలియన్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.