calender_icon.png 3 April, 2025 | 12:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అటవీ గ్రామంలో వైద్య శిబిరం

26-03-2025 01:08:56 AM

అనారోగ్య సమస్యలు తలెత్తితే ప్రభుత్వ ఆసుపత్రి సందర్శించండి: డాక్టర్ దివ్య నయన 

చర్ల, మార్చి 25 (విజయ క్రాంతి ): మారుమూల గిరిజన చర్ల మండలం లోని  సత్యనారాయణపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో గల యర్రంపాడు గ్రామంలో  డాక్టర్ దివ్య నాయన, డాక్టర్ రాంబాబు మొబైల్ మెడికల్ యూనిట్  ఆధ్వర్యంలో మంగళవారం  వైద్య శిబిరంను నిర్వహించారు.

ఇద్దరు జ్వరం బాధితులకు రక్త పరీక్ష లు నిర్వహించి చేసి  మలేరియా లేదని నిర్దారించారు. అనంతరం అనారోగ్య బాదితలకు చికిత్స అందించారు ,. ఈ సందర్భంగా డాక్టర్ దివ్య నయన  మాట్లాడుతూ 42 మందికి సాధారణ వ్యాధులకు సంబంధించిన మందులు ఇవ్వడం జరిగినదని.గర్భిణీ స్త్రీలకు పరీక్షలు నిర్వహించి  తగు సూచనలు చేశామన్నారు.

ప్రతి నెల గర్భిణీ స్త్రీల చెకప్ చేయించుటకు క్రమం తప్పకుండా ఆసుపత్రికి  రావాలని, సురక్షిత కాన్పు కొరకు ప్రాధమిక ఆరోగ్య కేంద్రము సత్యనారాయణపురం సందర్శించాలని తెలియజేశారు. ఎన్‌సిడి పరీక్షలు ర్యాపిడ్ ఫీవర్ సర్వే,జ్వరాలు వచ్చిన వెంటనే అశ్రద్ధ చెయ్యకుండా  ఆసుపత్రికి కి రావలెనని, ఎండాకాలంలో వచ్చే ఎండదెబ్బ గురికాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు వారికి వివరించారు. ఈ కార్యక్రమంలో హెచ్.ఈ.ఓ బాబురావు,యమ్ హెల్ హెచ్ పిసంధ్య, హెల్త్‌అసిస్టెంట్స్, రాజేశ్వరి, సుబ్బారావు, వరప్రసాద్, కవిత, ఆశా కార్యకర్త సోమమ్మ తదితరులు పాల్గొన్నారు.