కోరుట్ల, డిసెంబర్ 31: కోరుట్ల మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం పారిశుద్ద్య కార్మికులకు ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. మమత హాస్పిటల్ డాక్టర్ మిట్టపల్లి రాజేష్, డాక్టర్ నడికట్ల సంతోష్ కుమార్, డాక్టర్ మధుశ్రీ కార్మికు లకు వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందు లు అందజేశారు. పారిశుద్ద్య విధులు నిర్వహి స్తున్న ప్రతి కార్మికుడు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని డాక్టర్లు, కమిషనర్ తిరుపతి సూచించారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జీ సానిటరీ ఇన్స్పెక్టర్ అశోక్, కౌన్సిలర్లు, వైద్య, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.