08-04-2025 12:41:09 AM
- హాజరైన జిల్లా ప్రిన్సిపాల్ జడ్జి బీ పాపిరెడ్డి
జడ్చర్ల ఏప్రిల్ 7 :జడ్చర్ల పట్టణంలోని సీనియర్ సిటిజన్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన వైద్య శిబిరాన్ని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రిన్సిపాల్ జడ్జి బి పాపిరెడ్డి ప్రారంభించారు. సీనియర్ సిటిజన్లు ఆరోగ్యంగా ఉండేందుకు మంచి ఆహారం తీసుకోవాలని జడ్జి సూచించారు.
వైద్య శిబిరానికి హాజరైన సీనియర్ సిటిజన్ల ఆరోగ్య స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సెషన్స్ కోర్టు జడ్జి కే కళ్యాణ్ చక్రవర్తి, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి డి ఇందిర, మహబూబ్ నగర్ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సంపత్ కుమార్ సింగ్, ఫిజీషియన్ డాక్టర్ శ్వేత, డాక్టర్ సౌమ్య, సీనియర్ సిటిజెన్ల ఫోరం అధ్యక్షులు నయీముద్దీన్ తదితరులు పాల్గొన్నారు.