calender_icon.png 30 October, 2024 | 8:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వైద్య శిబిరం

06-07-2024 02:05:07 AM

కామారెడ్డి, జూలై 5 (విజయక్రాంతి) : కామారెడ్డి జిల్లా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు జన్మదినం సందర్భంగా శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన సతీమణి తోట అర్చన ప్రారంభించారు. అనంతరం ఆమె స్వయంగా వైద్యపరీక్షలు చేయించుకున్నారు. ఆశ్రయం హ్యాండ్ ఆఫ్ హోప్ వారి సహకారంతో ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. చిన్న పిల్లలు మొదలుకొని వృద్దుల వరకు వైద్య సేవలు నిర్వహించారు. అవసరమైన వారికి ఉచితంగా కంటి అద్దాలు, మందులు పంపిణీ చేశారు.