ప్రారంభించిన హెచ్‌ఎంఆర్‌ఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 3 (విజయక్రాంతి): తెలంగాణ ప్రజాపాలన - ప్రజా విజయోత్సవాల సందర్భంగా మంగళవారం బేగంపేట్‌లోని మెట్రో రైల్‌భవన్‌లో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా హెచ్‌ఎంఆర్‌ఎల్ అండ్ హెచ్‌ఏఎంఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి హాజరై వైద్య శిబిరాన్ని ప్రారంభించారు.
కిమ్స్ - సన్‌షైన్ హాస్పిటల్స్ బేగంపేట్ వైద్య బృందం సహకారంతో ఈ శిబిరాన్ని నిర్వహించారు. మెట్రో రైల్ సంస్థ అధికారులు, సిబ్బంది శిబిరంలో పాల్గొని దంత పరీక్షలు, కంటి పరీక్షలు, సాధారణ వైద్య పరీక్షలు చేయించుకున్నారు.