11-12-2024 01:57:43 AM
సినీనటుడు మోహన్‌బాబు నివాసం వద్ద ఉద్రిక్తత
తండ్రి,కొడుకు పరస్పరం ఫిర్యాదులు
మహేశ్వరం, డిసెంబర్ 10: మంచు కుటుంబంలో ఆస్తుల వివాదం రచ్చ కెక్కింది. ఆదివారం మొదలైన గొడవ రోజుకో మలుపు తిరిగింది. చివరికి మీడి యాపై దాడి వరకు వెళ్లింది. ఈ గొడవలు మంగళవారం సినీ నటుడు మోహన్‌బాబు పెద్దకుమారుడు విష్ణు రాకతో తార స్థాయికి చేరాయి. విష్ణు దుబాయ్ నుంచి వచ్చి జల్‌పల్లిలోని తండ్రి నివాసానికి చేరుకున్నారు.
కొంద రు మధ్యవర్తుల సహాయంతో కుటుంబసభ్యుల మధ్య గొడవలను చల్లార్చడానికి చర్చలు జరిపినట్లు సమాచారం. దాదాపు గొడవ పూర్తిగా చల్లారిందని అనుకునేలోపే సాయంత్రం మంచు మనోజ్ దంపతులు లక్డీకపూల్‌లోని డీజీపీ కార్యాలయానికి వెళ్లి తమకు రక్షణ కల్పించాలని విన్నవించారు.
అనంతరం మంచు మనోజ్ దంపతులు తమ పాపను తీసుకెళ్లేందుకు, తమ సామాగ్రిని తరలించడానికి జల్‌పల్లిలోని మోహన్‌బాబు నివాసానికి వెళ్లారు. అక్కడి భద్రతా సిబ్బంది మనోజ్‌ను లోపలికి అనుమతించకపోవడంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మనోజ్ తన బౌన్సర్ల సహాయంతో గేట్‌ను తన్నుకుంటూ లోపలికి వెళ్లారు.
కానీ, మోహన్‌బాబు తన భద్రత సిబ్బందితో కలిసి మనోజ్‌పై దాడి చేసినట్లు సమాచారం. అలాగే మీడియా కవరేజీ కోసం వెళ్లిన ఓ ఛానల్ రిపోర్టర్‌ను మోహన్‌బాబు మైక్ లాక్కొని కొట్టడంతో అతడి చెవి భాగంలో గాయమైంది. మీడియాపై మోహన్‌బాబు దాడిని ఖండిస్తూ విలేకరులు ఆందోళనకు దిగారు.
ఆయన వెంటనే క్షమాపణలు చెప్పాలని పలు సంఘాలు డిమాండ్ చేశాయి. దాడిని తెలంగాణ ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మసాదే లక్ష్మీనారాయణ, ప్రధాన కార్యదర్శి వెంకట్ ఖండించారు. నోటికొ చ్చినట్లు మాట్లాడిన మోహన్‌బాబు తన మాటలను ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు.
మరో వైపు ఈ పరిణామాల నేపథ్యంలో రాచకొండ సీపీ సుధీర్‌బాబు ఆదేశాల మేరకు మంచు మోహన్‌బాబు, మనోజ్ గన్‌లను పోలీసులు సీజ్ చేశారు.
పరస్పరం ఫిర్యాదు చేసుకున్న తండ్రీకొడుకులు..
హైదరాబాద్ నగర శివారులోని జల్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలో మంచు టౌన్‌షిప్ (ఫామ్‌హౌస్)లో నాలుగు రోజుల క్రితం తండ్రి మోహన్‌బాబు, కొడుకు మంచు మనోజ్ కుమార్‌కు మధ్య ఆర్థిక విషయాలతోపాటు ఆస్తుల విషయంలో గొడవ జరగడం సినీ పరిశ్రమతోపాటు అభిమానుల్లో హాట్ టాఫిక్‌గా మారింది.
తనపై దాడి చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని మంచు మనోజ్ కుమార్ సోమవారం సాయంత్రం పహాడిషరీఫ్ ఇన్స్‌పెక్టర్ గురువారెడ్డికి స్వయంగా వెళ్లి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మోహన్‌బాబుపై 329, 351, 115 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మనోజ్ ఫిర్యాదు చేసిన కొద్ది సేపటికే మోహన్‌బాబు తన కొడుకు మనోజ్, కోడలు మౌనికపై రాచకొండ కమిషనర్‌కు వాట్సాఫ్ ద్వారా ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది.
ఫిర్యాదులో తనకు మనోజ్, మౌనికలతోపాటు వారి అనుచరుల నుంచి రక్షణ కల్పించాలని, ఆస్తులతో పాటు విలువైన వస్తువులకు భద్రత కల్పించాలని కోరారు. అంతేకాకుండా మంచు ఫామ్ హౌస్‌లో నుంచి మనోజ్, మౌనికలను బయటకు పంపించి తనకు సెక్యూరీటి పెంచాలని మోహన్‌బాబు విన్నవించుకున్నారు.
మోహన్‌బాబు ఫిర్యాదును స్వీకరించిన రాచకొండ కమిషనర్ సుధీర్‌బాబు ఫిర్యాదు లేఖను పహాడిషరీఫ్ ఇన్స్‌పెక్టర్‌కు పార్వర్డ్ చేశారు. తండ్రీకొడుకులు పరస్పరం ఫిర్యాదులు చేసుకోవడంతో ఈ గొడవలు ఎక్కడికి దారితీస్తాయోననే చర్చ మొదలైంది.
మంచు విష్ణు రాకతో జల్‌పల్లిలో ఉత్కంఠ..
సినిమా షూటింగ్ నేపథ్యంలో దుబాయ్‌లో ఉన్న మంచు విష్ణు తన తండ్రి మోహన్‌బాబు, సోదరుడు మంచు మనోజ్‌ల మధ్య జరిగిన గొడవ విషయం తెలిసి మంగళవారం దుబాయ్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చారు. అక్కడి నుంచి ఆయన కారులో నేరుగా జల్‌పల్లిలోని మంచు టౌన్‌షిప్ ఫామ్‌హౌస్‌కు చేరుకున్నారు. విష్ణు రాకతో ఒక్కసారిగా మంచు ఫామ్‌హౌస్ వద్ద ఉత్కంఠ నెలకొంది.
అన్నదమ్ముల మధ్య ఫామ్‌హౌస్‌లో ఏం జరుగుతుందోననే టెన్షన్ వాతావరణం కనిపించింది. అయితే విష్ణు వచ్చిన కొద్ది సేపటికే పహాడిషరీఫ్ పోలీసులు ఫామ్‌హౌస్‌కు వచ్చి ముందుగా మనోజ్‌కుమార్ వెంట ఉన్న బౌన్సర్లను ఇంటి నుంచి బయటకు పంపించారు. ఆ తరువాత మనోజ్ కుమార్‌తోపాటు ఆయన భార్య మౌనికను కూడా ఇంటి నుంచి బయటకు పంపించారు. ఇంట్లో నుంచి భార్యతోపాటు మనోజ్ బయటకు రావడంతో ఒక్కసారిగా అందరూ షాక్‌కు గురయ్యారు.
ఆస్తుల కోసం కాదు.. ఆత్మ గౌరవం కోసం: మనోజ్
బయటకు వచ్చిన అనంతరం మంచు మనోజ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. నేను ఆస్తుల కోసం, డబ్బు కోసం ఆశ పడటం లేదు.. నా ఆత్మ గౌరవం కోసం పోరాటం చేస్తున్నానని అన్నారు. నా బిడ్డలు ఇంట్లో ఉండగా పోలీసులు వచ్చి ఏకపక్షంగా వ్యవహరించడం మంచిది కాదన్నారు. విష్ణు అనుచరులే సీసీ ఫుటేజ్ మొత్తాన్ని మాయం చేశారని, ఇంటిలో ఉన్న సీసీ కెమెరాలు అన్నింటిని విజయరెడ్డి, కిరణ్‌రెడ్డి తీసుకొని వెళ్లిపోయారని మంచు మనోజ్ ఆరోపించారు.
న్యాయం కోసం ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, రేవంత్‌రెడ్డి.. డిప్యూటీ సీఎంలు పవన్‌కల్యాణ్, మల్లు భట్టి విక్ర మార్కతోపాటు తెలంగాణ డీజీపీ డాక్టర్ జితేందర్‌ను కలిసి ఫిర్యాదు చేస్తానన్నారు. నా భార్య, పిల్లలకు రక్షణ లేకుండాపోయిందని, అందుకే కుటుంబ సభ్యులతో పోరాటం చేస్తున్నానని అన్నారు.
అదనపు డీజీపీని కలిసిన మనోజ్ దంపతులు..
మంచు ఫ్యామిలీ గొడవల నేపథ్యంలో తమకు రక్షణ కల్పించాలని మంచు మనోజ్ దంపతులు మంగళవారం సాయంత్రం లక్డీకపూల్‌లోని డీజీపీ కార్యాలయానికి వెళ్లి అదనపు డీజీపీ మహేశ్ భగవత్‌ను కలిశారు. తన ఫ్యామిలీలో చోటు చేసుకున్న తాజా పరిణామాలను వివరించా రు.
తమకు, కుబుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని, భద్రత కల్పించాలని కోరారు. దీనిపై స్పందించిన అదనపు డీజీపీ.. రాచకొండ సీపీని కలిసి ఫిర్యాదు చేయాలని వారికి సూచించినట్లు సమాచారం. అంతకు ముందు ఇంటెలిజెన్స్ డీజీ శివధర్‌రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు.
స్టాఫ్ కారణంగానే గొడవ జరిగింది
ఇంట్లో నుంచి బయటకు వచ్చిన పనిమనిషిని మీడియా పలకరించగా ఆమె మాట కలిపారు. మోహన్‌బాబు ఇంట్లో గొడవలు ఎందుకు జరుగుతున్నాయి.. కారణం ఎవరు? అనే కోణంలో ప్రశ్నించగా ఆమె స్పందించారు. ఈ నెల 7న రాత్రి సమయంలో స్టాఫ్ విషయంలో మనోజ్‌కుమార్ దు రుసుగా ప్రవర్తించాడని, అందుకు మోహన్‌బాబు స్టాఫ్ పట్ల మర్యాదగా నడుచుకోకుంటే మర్యాదగా ఉండదు అం టూ మనోజ్‌ను హెచ్చరించినట్లు తెలిపారు.
మాటామాటా పెరిగి మోహన్‌బా బుపై మనోజ్ కుమార్ చేయి చేసుకున్నట్లు ఆమె చెప్పారు. భూమా మౌనికను మనోజ్ పెండ్లి చేసుకోవడం కూడా మోహన్‌బాబు కుటుంబ సభ్యులకు ఇష్టంలే దని ఆమె పేర్కొన్నారు.
హాస్పిటల్‌లో చేరిన మోహన్‌బాబు
మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో మోహన్‌బాబు అస్వస్థతకు గురయ్యారు. దీంతో మంచు విష్ణు హుటాహుటిన మోహన్‌బాబును గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. వైద్య పరీక్షల అనంతరం మోహన్‌బాబుకు వైద్యులు చికిత్స అందించారు. ప్రస్తుతం మోహన్‌బాబు ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
నార్సింగిలో ఇంటిని పరిశీలించిన మంచు మనోజ్
రాజేంద్రనగర్: తన ఇంటి గొడవల నేపథ్యంలో మంచు మనోజ్ నార్సింగిలోని ముప్పా సమీపంలో ఉన్న తన ఇంటిని (కార్యాలయం) పరిశీలించారు. మంగళవారం మధ్యాహ్నం జల్‌పల్లిలోని ఇంట్లో ఉన్న సామగ్రిని తరలించేందుకు మనోజ్ ఏర్పాట్లు చేసుకున్నాడు.
రాచకొండ సీపీ నోటీసులు
మంచు కుటుంబంలో జరుగుతున్న గొడవల నేపథ్యంలో మంచు మోహన్‌బాబు ఆయన కుమారులు విష్ణు, మనోజ్‌లకు అదనపు మేజిస్ట్రేట్ హోదాలో రాచకొండ సీపీ సుధీర్‌బాబు నోటీసులు జారీచేశారు. ఈ రోజు ఉదయం 10:30 గంటలకు నేరెడ్‌మెట్‌లోని తన కార్యాలయంలో వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని సీపీ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాచకొండ సీపీ ఆదేశా ల మేరకు ఇప్పటికే మోహన్‌బాబు, మనోజ్‌ల తుపాకులను ఫిలింనగర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
గారాబంగా పెంచా కదరా!
మోహన్‌బాబు ఆడియో సందేశం
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 10 (విజయక్రాంతి): తన కుటుంబంలో చోటు చేసుకున్న పరిణామాలపై మోహన్‌బాబు స్పందించారు. మంగళవారం రాత్రి తన నివాసం వద్ద జరిగిన ఘటన అనంతరం మనోజ్‌ను ఉద్దేశించి ఆయన ఓ ఆడియో సందేశం విడుదల చేశాడు.
‘మనోజ్ నువ్వు నా బిడ్డవి. లక్ష్మీప్రసన్న, విష్ణువర్ధన్‌బాబు, మనోజ్‌కుమార్ మిమ్మల్ని ఎలా పెంచానో తెలుసుకదా. అందరికంటే నిన్నే గారాబంగా పెంచాను. నీకే ఎక్కువ ఖర్చుపెట్టి చదివించాలని ప్రయత్నించాను. నువ్వు ఏది అడిగినా ఇచ్చా ను. నువ్వు ఈ రోజు నా గుండెల మీద తన్నావ్. నా మనసు ఆవేదనతో కుంగిపోతోంది. నా బిడ్డ నన్ను తాకలేదు. కొన్ని కారణాల వల్ల ఇద్దరం ఘర్షణ పడ్డాం.
ప్రతి కుటుంబంలో ఘర్షణలు ఉంటాయి. జల్‌పల్లి ఇల్లు నా కష్టార్జితం.. నీకు సంబంధం లేదు. మంచు మనోజ్ మద్యానికి బానిసగా మారాడు. మద్యం మత్తులో ఎలాగో ప్రవర్తిస్తున్నాడు. ఇంట్లో పనిచేస్తున్న వారిపై దాడికి దిగడం మనోజ్‌కు సరికాదు. ఇక చాలు నా పరు వు ప్రఖ్యాతులు మంటగలిపావు. నన్ను ఎవరూ మోసగాడు అనలేదు.
నీకు జన్మనివ్వడమే నేను చేసిన పాప మా. ఆస్తులు ముగ్గురికీ సమానంగా రాయాలా? వద్దా? అనేది నా ఇష్టం. ఆస్తులు ఇస్తానా.. లేదా.. దానధర్మాలు చేస్తానా? అనేది నా ఇష్టం. నా ఇంట్లో అడుగు పెట్టడా నికి నీకు అధికారం లేదు. మనోజ్ నీ వల్ల మీ అమ్మ ఆసుపత్రిలో చేరింది. భార్య మాటలు విని తాగుడుకు అలవాటు పడ్డావు. తప్పు చేయనని చెప్పి మళ్లీ ఇంట్లోకి వచ్చావు. ఇక చాలు.. ఇంతటితో గొడవకు ముగింపు పలుకుదాం’ అని ఆడియో సందేశంలో పేర్కొన్నారు.