calender_icon.png 25 April, 2025 | 5:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఢిల్లీ ఎల్‌జీ పరువు నష్టం కేసులో మేధా పాట్కర్ అరెస్ట్

25-04-2025 11:35:32 AM

న్యూఢిల్లీ,(విజయక్రాంతి): ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా దాఖలు చేసిన 24 ఏళ్ల పరువు నష్టం కేసులో ఢిల్లీ కోర్టు సామాజిక కార్యకర్త మేధా పాట్కర్‌ పై బుధవారం నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన తర్వాత శుక్రవారం పాట్కర్‌ను అరెస్టు చేశారు. ఆమెను ఇవాళ సాకేత్ కోర్టు ముందు హాజరుపర్చగా, 23 ఏళ్ల క్రితం గుజరాత్‌లో ఒక ఎన్జీఓకి నాయకత్వం వహించినప్పుడు కేసు దాఖలు చేసిన ఢిల్లీ ఎల్జీ వీకే సక్సేనా పరువు నష్టం కేసులో ప్రొబేషన్ బాండ్‌లను సమర్పించాలని, రూ.1 లక్ష జరిమానా జమ చేయాలని ఇచ్చిన ఆదేశాలను ఆమె ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారని కోర్టు పేర్కొంది. 

పరువు నష్టం కేసులో నర్మదా బచావో ఆందోళన్ నాయకురాలిని దోషిగా తేల్చిన అదనపు సెషన్స్ జడ్జి విశాల్ సింగ్, ఏప్రిల్ 8న ఆమెను సత్ప్రవర్తన కింద ప్రొబేషన్‌పై విడుదల చేశారు. బుధవారం ఈ కేసులో పాట్కర్ హాజరు కావడం, ప్రొబేషన్ బాండ్లను సమర్పించడం, జరిమానా మొత్తాన్ని డిపాజిట్ చేయడం కోసం జాబితా చేశారు. సక్సేనా న్యాయవాది గజిందర్ కుమార్ మాట్లాడుతూ... పాట్కర్ హాజరు కాలేదని, కోర్టు ఆదేశాలకు ఆమె కట్టుబడి లేదని పేర్కొన్నారు.

ఇవాళ్టి కేసులో ఢిల్లీ పోలీస్ కమిషనర్ ద్వారా పాట్కర్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయబడింది, వాయిదా కోరుతూ దోషి దాఖలు చేసిన దరఖాస్తు దుర్మార్గమైందగా కోర్టు గుర్తించిందని సింగ్ అన్నారు. మే 3వ తేదీ నాటికి దోషి కోర్టు ఆదేశాన్ని పాటించకపోతే, ఏప్రిల్ 8న విధించిన శిక్షను మార్చడాన్ని కోర్టు పరిశీలిస్తుందని ఆయన అన్నారు. ఈ మేరకు మే 3కు తదుపరి విచారణ వాయిదా వేసింది.