calender_icon.png 4 October, 2024 | 10:49 PM

వేద మంత్రాలతో మేధా హోమం నిర్వహించిన సుడా చైర్మన్ కోమటిరెడ్డి

04-10-2024 07:01:03 PM

ప్రభుత్వ విధానాలపై బీఆర్ఎస్, బీజేపీల వైఖరి మారాలని నగర కాంగ్రెస్ మేధా హోమం

కరీంనగర్,(విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఒక వైపు ప్రజా పాలన నడుస్తుంటే మరొక వైపు కబ్జాలకు గురైన చెరువులు, కుంటలు, నాళాలు ప్రభుత్వ భూములను సంరక్షిస్తుంటే చూడలేక గుడ్డిగా వ్యతిరేకిస్తున్న బిజెపి, బిఆర్ఎస్ నాయకుల వైఖరి మారాలని నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో సుడా చైర్మన్ నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఇందిరా చౌక్ వద్ద వేద మంత్రాలతో మేధా హోమం నిర్వహించారు. కార్యక్రమ అనంతరం నరేందర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ విధానాలను గుడ్డిగా వ్యతిరేకిస్తున్న బిఅర్ఎస్, బిజెపి నాయకులకు జ్ఞానోదయం కలిగి వారి వైఖరిలో మార్పు రావాలని ఈ మేధా హోమం నిర్వహించామని అన్నారు.పది సంవత్సరాలు గడీల పాలన నడిపి యువ రాజుగా చెలామణి అయిన కేటిఆర్ అధికారం కోల్పోయాక తట్టుకోలేకపోతున్నాడనీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడానికి హరీష్ రావు, కేటిఆర్ లు పోటీ పడుతున్నారని నరేందర్ రెడ్డి అన్నారు.

బిజెపి నాయకులు ఉనికి కాపాడుకోవడం కోసం గుడ్డిగా వ్యతిరేకిస్తున్నారని అందుకే ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ రెండు పార్టీల నాయకుల వైఖరిలో ఈ మేధా హోమం ద్వారా నైనా  మార్పు రావాలని కోరుకుంటున్నామని కోమటిరెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు కొరివి అరుణ్ కుమార్,శ్రవణ్ నాయక్, ఎండి తాజ్, కార్పొరేటర్లు అర్షకిరన్మయి మల్లేశం,మెండి కల్యాణి చంద్ర శేఖర్, గంట కల్యాణి శ్రీనివాస్, కాషెట్టి లావణ్య శ్రీనివాస్, ఆకుల నర్మద నర్సయ్య, చర్ల పద్మ, షభాన మహమ్మద్,ముల్కల కవిత, జ్యోతి రెడ్డి, మహాలక్ష్మి మాజీ కార్పొరేటర్లు కోడూరి రవీందర్ గౌడ్, వాడి వెంకట్ రెడ్డి, దన్న సింగ్, జిడి రమేష్, పొరండ్ల రమేష్, కుర్ర పోచయ్య, బొబ్బిలి విక్టర్, కొట్టె ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.