హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 21 (విజయక్రాంతి): ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా సంక్షేమ అధికారి జిల్లాస్థాయి ఆటల పోటీలను నిర్వహించారు. నేరేడ్‌మెట్‌లోని రామకృష్ణాపురం అంబేద్కర్ ఫుట్‌బాల్ గ్రౌండ్‌లో జరిగిన ఈ పోటీల్లో దాదాపు 600 మంది క్రీడాకారులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.
జిల్లా అధికారి కే స్వర్ణలత, హెలెన్ కెల్లర్స్ సంస్థ అధినేత పటాన్ ఉమర్ఖాన్, మధుసూదన్ రెడ్డి, నేరేడ్‌మెట్ పోలీస్ అధికారి వీ సైదులు, గుత్తికొండ గాలి బుడగలు ఎగరేసి పోటీలను ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన జిల్లా అధికారి కే స్వర్ణలత మాట్లాడుతూ.. పిల్లలకు చదువుతోపాటు ఆటలు ముఖ్యమని, మీరు జిల్లాస్థాయి నుండి దేశస్థాయి వరకు ఎదగాలని ఆశీర్వదించారు. దివ్యాంగులకు అన్నీ రంగాల్లో సమాన అవకాశాలు కల్పించాలని కోరారు.
పోటీల్లో 15 ప్రత్యేక పాఠశాలలతో పాటు వివిధ దివ్యాంగుల సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. కార్యక్రమానికి ఐసీడీఎస్ స్వాతి, రేణుక, శారద, బ్లైండ్ ప్రెసిడెంట్ శ్రీశైలం, ఇంతియాజ్, పాపారావు, ప్రత్యేక పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విజేతలుగా బధిరుల నుంచి ఎండీ జహంగీర్ ఆశ్రా మొదటి స్థానా న్ని గెలుచుకున్నారు. పరుగు పందెంలో బుద్ధిమాంద్యత గల విద్యార్థులు రామ్ చరణ్‌గౌడ్, హరిచంద్ర బహుమతులు గెలుచుకున్నారు.