calender_icon.png 11 March, 2025 | 5:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాతీయస్థాయిలో బాలికలకు పతకాలు

11-03-2025 12:00:00 AM

వేములవాడ, మార్చి 10: జాతీయస్థాయి ఆల్ స్టుల్స్ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్ షిప్‌లో  బాలికలు బంగారు, వెండి పతకాలు సాధించారని  స్పార్క్  కుంగూఫు ఇన్  స్ట్రక్టర్ నేరెళ్ల శ్రీధర్ గౌడ్ తెలిపారు. ఆదివారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో  షావెలిన్ కుంగ్ ఫు బ్రూస్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో  ఫస్ట్ జాతీయస్థాయి ఆల్ స్టుల్స్ మార్షల్ ఆర్ట్స్ పోటీలు నిర్వహించగా చందుర్తి మండలం  మూడపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల, నర్సింగాపూరు ప్రభుత్వ ఉన్నత పాఠ శాలలకు చెందిన బాలికలు 12 స్వర్ణ పతకాలు, 5 సిల్వర్ పతకాలు సాధించారు.

జూనియర్ టీమ్ కటా విభాగంలో మూడపల్లి   పాఠశాలకు చెందిన  రిక్షిత, హరిషా, రిషిత, శ్రీచరిత, స్నేహిత, ఆకర్షణ, అక్షర, షాఖీరా మేఘం, పణ్య ప్రభ లు బంగారు పతకాలు సాధించగా,  నర్సింగాపూరు పాఠశాల కు చెందిన గ్రూప్ కటా విభాగంలో హేమ, వర్షశ్రీ, మేరీ,బంగారు పథకాలు సాధించిగా, అక్షయ, రిశ్విత, అక్షయ, సాన్వి శ్రీ, అభినయ శ్రీ వెండి పతకాలు కైవసం చేసుకున్నట్లు శ్రీధర్ గౌడ్ తెలిపారు. పతకాలు సాధించిన విద్యార్థులను ప్రధానో పాధ్యాయులు మల్లేశం, జితేందర్, ఉపాధ్యాయులు   అభినందించారు.