calender_icon.png 3 April, 2025 | 8:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జీకే ఒలంపియాడ్‌లో ఆల్ఫోర్స్ విద్యార్థులకు పతకాలు

26-03-2025 01:07:41 AM

కరీంనగర్, మార్చి 25 (విజయ క్రాంతి): జోనల్ స్థాయి స్మార్ట్ కిడ్స్ జి.కె ఒలంపియాడ్లో అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్ విద్యార్థులు పాల్గొని అత్యధిక పతకాలు సాధించారు. పాఠశాలకు చెందిన వి. ఆశ్రిత రెడ్డి,  సి.హెచ్. సోహన్, పి. మయాంక్ రెడ్డి,  సాగి శ్రీదాత్రి, యు. రితేష్, ఇ. లిఖిత్ కుమార్, ఇ. రాజ్ ఆరుష్ పటేల్, కె. తనీష్ రెడ్డి, కె. రిషిక్ లు జోనల్ స్థాయిలో మెడల్స్ ఆఫ్ ఎక్స్ లెన్స్ కైవసం చేసుకున్నారని ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి తెలిపారు. అత్యధిక పతకాలతో ఘనవిజయం కైవసం చేసుకునందుకు పుష్పగుచ్చాలతో పాటు జ్ఞాపికలను అందజేసి భవిష్యత్తులో మరిన్ని విజయాలు నమోదు చేయాలని ఆకాంక్షించారు.