calender_icon.png 16 January, 2025 | 6:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పతకాలమయం

03-09-2024 01:53:29 AM

  1. పసిడి నెగ్గిన నితేశ్
  2. రజతంతో మెరిసిన యోగేశ్, తులసిమతి
  3. ఒకే రోజు భారత్ ఖాతాలో ఏడు పతకాలు

ప్రతిష్ఠాత్మక పారాలింపిక్స్‌లో ఐదోరోజు భారత అథ్లెట్లు పతకాల పంట పండించారు. ఒక పతకం వచ్చిందని సంబురపడేలోపే మరో పతకం అన్నట్లుగా సాగింది ఇవాళ మన పారా అథ్లెట్ల ప్రదర్శన. రెండో రోజు భారత్ నాలుగు పతకాలతో మెరవగా.. ఐదో రోజు ఏకంగా భారత్ ఒడిలో ఏడు పతకాలు చేర్చి చరిత్ర సృష్టించారు. ఇందులో నాలుగు స్వర్ణాలు ఉండడం విశేషం. అందులో బ్యాడ్మింటన్‌లోనే ఐదు పతకాలు ఉండగా.. మిగతా రెండు అథ్లెటిక్స్ విభాగం నుంచి వచ్చాయి. దీంతో భారత్ ఖాతాలో 14 పతకాలు వచ్చి చేరాయి. గత టోక్యోను దాటడానికి మరో ఆరు పతకాల దూరంలో నిలిచారు. టార్గెట్ 25తో బరిలోకి దిగిన మన పారా అథ్లెట్లు దానిని నిజం చేయాలని ఆశిద్దాం..!

విజయక్రాంతి ఖేల్ విభాగం: పారిస్ పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్లు మరోమారు సత్తా చాటారు. క్రీడల్లో భాగంగా ఐదోరోజున భారత్ ఒడిలో ఏడు పతకాలు వచ్చి చేరాయి. అందులో బ్యాడ్మింటన్‌లోనే నాలుగు పతకాలు ఉండగా.. ఆర్చరీ, అథ్లెటిక్స్ విభాగం నుంచి ఒక్కో పతకాలు వచ్చా యి. పురుషుల బ్యాడ్మింటన్ ఎస్‌ఎల్ కేటగిరీలో భారత షట్లర్ నితేశ్ కుమార్ సంచలన విజయంతో స్వర్ణం కైవసం చేసుకోగా.. ఎస్‌ఎల్ కేటగిరీలో సుహాస్ యతిరాజ్  రజతం గెలుచుకున్నాడు. 

ఇక మహిళల సింగిల్స్ ఎస్‌యూ కేటగిరీలో మురుగేశన్ తులసిమతి రజతం గెలవగా.. ఎస్‌యూ కేటగిరీలో మనీశా రమాదాస్‌లు కాంస్యాలు ఒడిసిపట్టారు.ఇక పురుషుల ఎఫ్ 56 డిస్కస్ త్రోలో భారత అథ్లెట్ యోగేశ్ కతునియా రజతం నిలబెట్టుకున్నాడు. గత టోక్యోలోనూ యోగేశ్ రజతంతో మెరిసిన సంగతి తెలిసిందే. 

యోగేశ్‌కు రజతం..

పురుషుల ఎఫ్ డిస్కస్ త్రోలో భారత్‌కు చెందిన పారా అథ్లెట్ యోగేశ్ కతునియా రజత పతకం గెలుచుకున్నాడు. టోక్యో పారాలింపిక్స్‌లో రజతం నెగ్గిన యోగేశ్.. మరోమారు అదే సీన్ రిపీట్ చేశాడు. డిస్కస్ త్రో ఎఫ్ ఫైనల్ పోరులో యోగేశ్  తొలి ప్రయత్నంలోనే 42.22 మీటర్ల మేర విసిరి ఔరా అనిపించాడు.  బ్రెజిల్‌కు చెందిన పారా అథ్లెట్ బటిస్టా (46.86 మీ) విసిరి స్వర్ణ దక్కించుకోగా.. గ్రీస్‌కు చెందిన టీజౌనిస్ (41.32 మీ) కాంస్యం కైవసం చేసుకున్నాడు. ఇండియన్ ఆర్మీ కుటుంబంలో జన్మించిన యోగేశ్ పారా అథ్లెట్‌గా ఎదగడంలో తల్లి మీనాదేవి పాత్ర కీలకం. 9 ఏళ్ల ప్రాయంలోనే యోగేశ్ గులియన్ అనే అరుదైన వ్యాధి బారిన పడ్డాడు.

ఈ వ్యాధి వల్ల యోగేశ్ నడవలేకపోయాడు. అయితే ఫిజియోథెరపీ కోర్సు చేసిన మీనాదేవీ కుమారుడికి అండగా నిలిచింది. 12 ఏళ్ల ప్రాయం వచ్చేసరికి యోగేశ్ కాళ్లలో బలం రావడంతో నడకను అలవాటు చేసుకున్నాడు.  ఆ తర్వాత యోగేశ్ ఢిల్లీలోని కిరోరీ మాల్ కళాశాలలో డిగ్రీ చదువుతున్న సమయంలో తన స్నేహితుడు పారాలింపిక్స్ గురించి చెప్పడంతో దీనిపై దృష్టి సారించాడు. 2016లో కెరీర్ ఆరంభించిన యోగేశ్ 2018లో బెర్లిన్ వేదికగా జరిగిన ప్రపంచ పారా అథ్లెటిక్స్ యూరోపియన్ చాంపియన్‌షిప్‌లో ఎఫ్ కేటగిరీలో డిస్స్ త్రోను 45.18 మీటర్లు విసిరి రికార్డు సృష్టించాడు. ఆ తర్వాత 2020 టోక్యో పారాలింపిక్స్‌లో పాల్గొన్న కతునియా రజతంతో చరిత్ర సృష్టించాడు. 

తులసికి రజతం.. మనీశాకు కాంస్యం

పారా బ్యాడ్మింటన్‌లో మరో రెండు పతకాలు భారత్ ఒడిలో వచ్చి చేరాయి. మహిళల సింగిల్స్‌లో తులసిమతి రజతం నెగ్గగా.. మనీశా రమాదాస్ కాంస్యం గెలుచుకుంది. మహిళల సింగిల్స్ ఎస్‌యూ కేటగిరీ ఫైనల్లో తులసిమతి 17 10 చైనా డిఫెండింగ్ చాంపియన్ యాంగ్ చేతిలో పరాజయం చవిచూసింది. కాంస్య పతక పోరులో మనీశా 21 21 డెన్మార్క్‌కు చెందిన కేథరిన్ రోసెన్‌గ్రెన్‌ను చిత్తుగా ఓడించింది.

నితేశ్ అద్వితీయం

పారాలింపిక్స్‌లో భారత షట్లర్లు అదరగొడుతూ ఎక్కువ సంఖ్యలో పతకాలు కొల్లగొడు తున్నారు. తాజాగా పురుషుల సింగిల్స్ ఎస్‌ఎల్ కేటగిరీలో నితేశ్ కుమార్ పసిడి నెగ్గాడు. తొలిసారి పారాలింపిక్స్‌లో ఆడుతున్న నితేశ్ ఫైనల్లో 21 18 23 డానియల్ బెతెల్ (బ్రిటన్)ను మట్టికరిపించాడు. టోక్యో పారాలింపిక్స్‌లో రజతం సాధించిన బెతెల్ ఈసారి కూడా ఫైనల్లో చివరి వరకు గట్టిపోటీ ఇచ్చినప్పటికీ నితేశ్ ముందు నిలవలేక మరోసారి రజతానికే పరిమితమయ్యాడు. తొలి గేమ్‌లో భారత షట్లర్ ఆధిపత్యం ప్రదర్శించగా.. రెండో గేమ్ హోరాహోరీగా సాగింది.

ఒక దశలో 11 ఆధిక్యంలో నిలిచిన నితేశ్ తర్వాత కాస్త పట్టు తప్పాడు. అయితే నిర్ణయాత్మక మూడో గేమ్ నువ్వా నేనా అన్నట్లుగా సాగినప్పటికీ చివరకు నితేశ్ పైచేయి సాధించాడు. 2009లో విశాఖపట్నంలో జరిగిన రైలు ప్రమాదంలో 15 ఏళ్ల నితేశ్ ఎడమకాలు పూర్తిగా విరగడంతో వైద్యులు ఆపరేషన్ చేసి కాలు తీసేశారు. 2016లో పరీదాబాద్ వేదికగా జరిగిన జాతీయ పారా అథ్లెట్ గేమ్స్‌లో అరంగేట్రం చేసి న నితేశ్ కాంస్యం నెగ్గా డు. 2022 ఆసియా పారా గేమ్స్‌లో మూ డు పతకాలు నెగ్గాడు.