హనోయి: వియత్నాంలో జరిగిన ప్రపంచ టెక్ బాల్ చాంపియన్‌షిప్‌లో భారత్ పతకంతో మెరిసింది. పురుషుల డబుల్స్ విభాగంలో భారత్‌కు చెందిన అనస్ బేగ్, డెక్లాన్ జోడీ కాంస్య పతకం గెలుచుకుంది. సెమీస్ లో ఓడిపోయినా కానీ మూడో స్థా నంలో నిలిచి పతకం దక్కించుకుంది. టెక్‌బాల్‌లో పతకం సాధించిన 11వ దేశంగా భారత్ రికార్డుల్లోకెక్కింది.