calender_icon.png 10 March, 2025 | 10:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉత్సవాలలో పాల్గొన్న మెదక్ ఎమ్మెల్యే

10-03-2025 07:33:42 PM

పాపన్నపేట: పాపన్నపేట మండల పరిధిలోని ముద్దాపూర్ గ్రామంలో సోమవారం శ్రీ నల్లపోచమ్మ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం వైభవంగా జరిగింది. గ్రామస్థుల ఆహ్వానం మేరకు కార్యక్రమానికి మెదక్ ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఆయనను స్వాగతించి, సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం సీతానగరంలో జరుగుతున్న బీరప్ప జాతర ఉత్సవాలలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముద్దాపూర్, సీతానగరం భక్తులతో పాటు కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు ప్రభాకర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, గోవింద్ నాయక్, నరేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.