calender_icon.png 29 March, 2025 | 1:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సైకిల్‌పై వచ్చాడు.. బస్సులో వెళ్లాడు..

23-03-2025 10:01:44 AM

మెదక్ జిల్లా కలెక్టర్..

రామాయంపేట, (విజయక్రాంతి): అసలే ఆదివారం ప్రభుత్వ సెలవు దినం అయినప్పటికీ నైట్ ప్యాంటు టీ షర్ట్ పై సైకిల్ పై సతీ సమేతంగా వచ్చిన వ్యక్తి ఎవరా వ్యక్తి, సైకిల్ పై వచ్చాడు.. బస్సులో వెళ్లి... అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆయనే మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్. మెదక్ జిల్లా రామాయంపేట బస్టాండ్ లో జిల్లా కలెక్టర్ రాహుల్రాజ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. బస్టాండ్ ఆవరణలో ఉన్న పరిసరాలను ఆయన పరిశీలించి ఎండాకాలం దృష్ట్యా ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా నీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని, బాత్రూంలు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని మున్సిపల్ సిబ్బందికి ఆయన సూచించారు.

కామారెడ్డి డిపోకు సంబంధించిన బస్సులు రామాయంపేట బస్టాండ్ రావడంలేదని ప్రయాణికులు ఆయన దృష్టికి తీసుకుపోయారు, అనంతరం ఆయన మాట్లాడుతూ వేసవికాలం దృష్ట్యా ప్రయాణికులకు తాగునీటి ఇబ్బందులు కలగకూడదని, ఆర్టీసీ ఎండితో మాట్లాడి కామారెడ్డి నుండి హైదరాబాద్ వెళ్లే బస్సులు కూడా రామాయంపేటలో ఆగే విధంగా కృషి చేస్తానని ఆయన తెలిపారు, ఆర్టీసీ బస్సులలో 70 శాతం మంది మహిళలు ప్రయాణిస్తున్నారని వారి ప్రయాణానికి అనుగుణంగా బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్టు ఆయన తెలిపారు. మరికొద్ది రోజుల్లో ప్రయాణికులకు చల్లని త్రాగునీరు డిఎం అందిస్తున్నట్లు ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.