calender_icon.png 12 February, 2025 | 8:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఢిల్లీలోని అంతర్జాతీయ సదస్సుకు మెదక్ కలెక్టర్

12-02-2025 12:45:16 AM

ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరు 

మెదక్, ఫిబ్రవరి 11 (విజయ క్రాంతి): ఢిల్లీలో జరిగిన తదుపరి తరం పరిపాలనా సంస్కరణల అంతర్జాతీయ సదస్సుకు మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ కు ప్రత్యేక ఆహ్వానం అందింది. జిల్లా కలెక్టర్ గా మూడు జిల్లాల్లో పనిచేసిన  పాలనాపరమైన అనుభవాలను దేశ విదేశీ ప్రతినిధులతో  పంచుకున్నారు.

మంగళవారం ఢిల్లీలో ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ సైన్సెస్,  భారత ప్రభుత్వ ఆధీనంలోని పరిపాలనా సంస్కరణల విభాగం  సంయుక్తంగా నిర్వహించిన తదుపరి తరం పరిపాలనా సంస్కరణల సదస్సుకు  కలెక్టర్ రాహుల్ రాజ్ ప్రత్యేక ఆహ్వానితునిగా  పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ సదస్సులో పాల్గొన్న దేశ విదేశ ప్రతినిదులతో తదుపరి తరం పరిపాలనపై గత నాలుగు సంవత్సరాలలో మూడు జిల్లాల్లో కలెక్టర్ గా పాలనా పరంగా గుడ్ గవర్నెన్స్ లో  తన అనుభవాలను పంచుకున్నారు. ఆలాగే ఇతర దేశాలలోని పరిపాలన సంస్కరణల గురించి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో దేశ విదేశాల పరిపాలన సంబందిత ప్రతినిదులు హాజరయ్యారు.