calender_icon.png 25 March, 2025 | 11:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీబీఐ అదుపులో మెదక్ సెంట్రల్ జీఎస్టీ సూపరింటెండెంట్

22-03-2025 12:15:02 AM

హైదరాబాద్, మార్చి 21 (విజయక్రాంతి): మెదక్ సెంట్రల్ జీఎస్టీ సూప రింటెండెంట్ రవిరాజన్ అగర్వాల్‌ను శుక్రవారం సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. రవిరాజన్ అగర్వాల్ పై అవినీతి ఆరోపణల నేపథ్యంలో  మెదక్ సెంట్రల్ జీఎస్టీ ఆఫీస్‌లో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. అనంతరం ఆయన్ను అదుపులోకి తీసుకొని, హైదరాబాద్‌కు  తరలించారు. శనివారం విచారణ చేయనున్నారు.