calender_icon.png 4 January, 2025 | 6:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యాంత్రీకరణ పథకానికి శ్రీకారం

02-01-2025 01:40:34 AM

  1. సంక్రాంతి తరువాత జిల్లాలవారీగా పరికరాల ప్రదర్శన
  2. కేంద్రం రూ.26 కోట్లు ఇవ్వగా, రాష్ట్ర వాటా రూ.20 కోట్లు జమ
  3. ముందుగా ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, మెదక్ జిల్లాల్లో ఎగ్జిబిషన్లు 
  4. వ్యవసాయ నిపుణులతో రైతులకు పరికరాల వినియోగంపై అవగాహన

హైదరాబాద్, జనవరి 1 (విజయక్రాంతి): వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తున్నది. గత ప్రభుత్వం నిలిపివేసిన వ్యవసా య యాంత్రీకరణ పథకం ఈ నెల రెండో వారంలో ప్రారంభించి రైతులకు అధునాతన పరికరాలు అందించేందుకు ఏర్పాట్లను వేగవంతం చేసింది.

ఇందులో భాగంగా సంక్రాంతి పండుగ తరువాత జిల్లాలవారీగా యంత్రాల ప్రదర్శన ఏర్పాటు చేసి, రైతులకు వాటి వినియోగంపై వ్యవసాయ శాఖ అవగాహన కార్యక్రమాలు చేపట్టనుంది. యా సంగి సీజన్‌కే కావాల్సిన పరికరాలు అందించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. 40 శాతం సబ్సిడీతో పంపిణీ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది.

రాష్ర్టంలో కేసీఆర్ రెండోసారి అధికారం చేపట్టిన తరువాత వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని నిలిపివేశారు. ప్రస్తు తం రేవంత్‌రెడ్డి సర్కార్ ఈ పథకాన్ని తిరిగి ప్రారంభిస్తుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

దీనికి కేంద్ర ప్రభు త్వం ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.26 కోట్లను కేటాయించగా, రాష్ర్ట ప్రభు త్వం తన వాటా రూ.20 కోట్ల ను విడుదల చేసింది. మొత్తం రూ.46 కోట్లతో యాంత్రీకరణ పథకాన్ని అమలు చేసేందుకు రాష్ర్ట ప్రభుత్వం ఇటీవల జిల్లా వ్యవసాయ శాఖ అధికారుల కు ఆదేశాలు జారీ చేసింది.

వ్యవసాయశాఖ ద్వారానే పరికరాలు పంపిణీ

గతంలో యాంత్రీకరణ పథకం తెలంగా ణ రాష్ర్ట వ్యవసాయ పారిశ్రామిక అభివృద్ధి సంస్థ ద్వారా అమలయ్యేది. కొందరు అధికారులు పేద రైతులకు ఇవ్వకుండా భూస్వా ములకు పంపిణీ చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. దీంతో వ్యవసాయ శాఖ ద్వారానే రైతులకు అందించేందుకు ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.

ముందు గా వ్యవసాయ పరికరాలు, యంత్రాలతో ఉమ్మడి నల్లగొండ, మెదక్, ఖమ్మం, కరీంన గర్ జిల్లాల్లో ఎగ్జిబిషన్స్ నిర్వహిస్తారు. వీటిలో యంత్రపరికరాల ఉత్పత్తి సంస్థల ప్రతినిధులు, వ్యవసాయ శాఖ నిపుణులు హాజరై పరికరాల ఉపయోగం, పని విధా నం, ధరలు, రాయితీ తదితర అంశాలను అన్నదాతలకు వివరిస్తారు. అనంతరం ఆసక్తి ఉన్న రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించి సబ్సిడీపై అందజేస్తారు.

హార్వేస్టర్లు, ఎంబీ నాగళ్లు పంపిణీ

గతంలో ఈ పథకం కింద రైతులకు ట్రాక్టర్లను అందజేసే వారు. గత ఐదేళ్లలో ట్రాక్టర్ల సంఖ్య భాగా పెరిగింది. వీటిని తీసుకునేందుకు రైతులు మొగ్గు చూపడం లేదు. దీంతో వ్యవసాయ శాఖ ట్రాక్టర్లు కాకుండా హార్వెస్టర్లు, పవర్ టిల్లర్లు, ఎంబీ నాగళ్లు, తైవాన్ స్ప్రేయర్లు, గడ్డికట్టలు కట్టే బేలార్ యంత్రా లు, రొటోవేటర్లు, పత్తి తీత, మామిడికాయలను తెంపే, గడ్డి కత్తిరించె, పసుపు ఉడికించె, మొక్కజొన్నలను ఒలిచే యంత్రాలను అందజేయనున్నారు.

రైతులకు కావాల్సిన యం త్రాల జాబితా నెల రోజుల క్రితమే సిద్ధం చేసినట్టు అధికారులు తెలిపారు. కొనుగోలు చేసిన పరికరాలను రైతులు సొంత అవసరాలకు వినియోగించుకోవడంతోపాటు అద్దెకు ఇచ్చి అదనపు ఆదాయం పొందే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు వెల్లడించారు.

కూలీల కొరత అధిగమించేందుకు వీలుంటుంది

అధునాతన పరికరాలతో కూలీల కొరత నుంచి రైతులు ఉపశమనం కలుగుతుందని, గత రెండేళ్ల నుంచి కూలీల సంఖ్య తగ్గడంతో ప్రకృతి విపత్తులు వస్తే చేనులో పంట నాశనం అయ్యే పరిస్థితి ఉందని రైతు సంఘాల నాయకులు పేర్కొన్నారు. నూతన యంత్రాలతో త్వర గా పని కావడంతోపాటు పంట నాణ్యతగా ఉంటుందని తెలిపారు. వ్యవసాయ రంగానికి ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేస్తే భవిష్యత్తులో రైతులకు నష్టాలు ఉండవని, ప్రస్తుతం పండించిన పంటలో సగం కూలీలకే సరిపోతుందని వెల్లడించారు.