calender_icon.png 20 April, 2025 | 2:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మైనార్టీ సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసిన మెకానిక్ శ్రీను

27-03-2025 10:19:32 PM

వనపర్తి టౌన్: వనపర్తి పట్టణంలోని మైనార్టీ సోదరులకు 22వ వార్డులోని ఈద్గా మస్ జీద్ లో దావత్ ఎ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసిన మెకానిక్ శ్రీను మజీద్ లో మైనార్టీ సోదరులతో కలసి ప్రత్యేక ప్రార్థనలు చేసి అక్కడ ఉన్న వారి అందరిని కలిసి వారితో మాట్లాడుతూ.. అందరికి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసి ఈ పవిత్ర రంజాన్ మాసం మీకు ప్రత్యేకమైనదని దైవ ఆశీస్సులు మనందరిపై ఉండాలని ఆశిస్తూ మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను అని అన్నారు. అనంతరం మెకానిక్ శ్రీను మైనారిటీ సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఇట్టి కార్యక్రమంలో ఈద్గా మజీద్ ఇమామ్, వాజిద్ అలీ ఖాన్, మహమ్మద్, హరీఫ్, సమీర్, కాలీద్, జాహిర్, మహేష్, నిరంజన్, సత్తార్, రఫిక్, మతిన్, షాకీల్ షఫీ, లతీఫ్, జోహెబ్, 22వ వార్డు మైనార్టీ నాయకులు పాల్గొన్నారు.