calender_icon.png 21 October, 2024 | 3:31 AM

మెకానిక్ రాకీ మాస్ జాతర పక్కా

21-10-2024 12:35:28 AM

విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మెకానిక్ రాకీ’. కొత్త దర్శకుడు రవితేజ ముళ్లపూడి తెరకెక్కిస్తున్న ఈ మూవీని ఎస్‌ఆర్ టీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామ్ తాళ్లూ రి నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికలు. నరేశ్, సునీల్, వైవా హర్ష, హర్షవర్ధన్, రోడీస్ రఘు రామ్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. మేకర్స్ ఈ సినిమా ట్రైలర్‌ను ఆదివారం విడుదల చేశారు.

హైదరాబాద్‌లో జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో చిత్ర కథానాయకుడు విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. ‘నన్ను ఇక్కడివరకూ తీసుకొచ్చింది మీ అభిమానమే. నవంబర్ 22 సినిమా రిలీజ్ కానుంది. విడుదలకు ఒక రోజు ముందు పెయిడ్ ప్రీమియర్స్ వేస్తాం. రెండోసారి చూసే రేంజ్‌లో ఉంటుందీ సినిమా. ఇది ట్రైలర్ 1.0. మరో ట్రైలర్ కూడా రిలీజ్ అవుతుంది’ అని తెలిపారు. ‘ట్రైలర్ మీ అందరికీ నచ్చడం ఆనందంగా ఉంది. సినిమా కూడా మాస్ కా దాస్ రేంజ్‌లో ఉంటుంది. నవంబర్ 22 థియేటర్లలో మాస్ జాతరే’ అని నిర్మాత రామ్ తాళ్లూరి అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్, డైరెక్టర్ రవితేజ, చిత్రబృందం పాల్గొన్నారు.