విశ్వక్ సేన్ కథానాయకుడిగా మాస్ యాక్షన్, కామెడీ ఎంట ర్‌టైనర్‌గా రూపొందుతున్న చిత్రం ‘మెకానిక్ రాకీ’. ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, శ్రద్దా శ్రీనాథ్ కథానాయికలుగా నటిస్తున్నారు. రవితేజ ముళ్లపూడి దర్శకత్వం వహిస్తుండగా.. రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకూ విడుదలైన టీజర్, రెండు పాటలు అంచనాలను పెంచేశాయి.
సోమవారం సినిమా విడుదల తేదీకి సంబంధించిన అప్‌డేట్‌ను మేకర్స్ ఇచ్చారు. దీనికి సంబంధించి ఒక పోస్టర్‌ను విడుదల చేశారు. నవంబర్ 22న మెకానిక్ రాకీ ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ పోస్టర్‌లో ఇంటెన్స్ ఎక్స్‌ప్రెషన్‌తో విశ్వక్ సేన్, సంప్రదాయ చీరలో మీనాక్షి, మోడర న్ అవుట్ ఫిట్‌లో శ్రద్దా ఆకట్టుకున్నారు. ఈ చిత్రానికి బిజోయ్ మ్యూజిక్ అందిస్తున్నారు. నరేష్, వైవా హర్ష, రోడీస్ రఘురామ్ తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు.