calender_icon.png 19 October, 2024 | 7:55 PM

మెకానిక్ రాకీ ముక్కోణ ప్రేమకథ

29-07-2024 12:05:00 AM

మెకానిక్ రాకీగా మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్‌తో రొమాన్స్ చేయనున్నాడు కథానాయకుడు విశ్వక్‌సేన్. ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రామ్ తాళ్ళూరి నిర్మిస్తున్న ఈ ముక్కోణ ప్రేమకథ  అక్టోబర్ 31న థియేటర్లలోకి రానుంది. రవితేజ ముళ్లపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా గ్లింప్స్ నేడు విడుదల చేశారు దర్శక నిర్మాతలు. ఈ మేరకు చిత్ర బృందం మీడియాతో సమావేశమైంది. ఈ కార్యక్రమంలో హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ “ఈ ఏడాది చాలా స్పెషల్. మూడో సినిమా కూడా రాబోతోంది. మా సినిమాకి పనిచేసిన మనోజ్ ఇండియాలో టాప్ డీవోపీ అవుతాడు. శ్రద్దా కెరీర్‌లో ఇది బెస్ట్ లుక్. ఇది బ్యూటీఫుల్ ట్రైయాంగిల్ లవ్ స్టొరీ. ముందుముందు ఈ సినిమా నుంచి చాలా రాబోతున్నాయి. మలక్ పేట్ బ్యాక్ డ్రాప్ నడిచే నా పాత్ర చాలా కనెక్టింగ్ ఉంటుంది. ఈ రొమాంటిక్ కామెడీ యాక్షన్ థ్రిల్లర్ దీవాళి క్రాకర్ అవుతుంది” అన్నారు.